Skip to main content

Daily Current Affairs in Telugu: 05 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
Daily GK for Students   05 december Daily Current Affairs in Telugu   Latest Updates for Competitive Exams
05 december Daily Current Affairs in Telugu

1. ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ భారత బాక్సర్లు హార్దిక్‌ , అమిశా , ప్రాచీ రజత పతకాలు నెగ్గారు.

2. భారతదేశం 2027–28లో ఐదు ట్రిలియన్‌ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ అంచనా వేస్తున్న విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. 

Daily Current Affairs in Telugu: 04 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్‌ నిలిచాయని ‘ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’(ఈఐయూ) తెలిపింది.

4. స్క్వాడ్రన్‌ లీడర్‌ మనీషా పాఢి దేశంలో గవర్నర్‌ ఏడీసీగా తొలి మహిళగా నియమితులయ్యారు. 

5. భూదాన్‌పోచంపల్లికి చెందిన ఇక్కత్‌ వరల్డ్‌ అధినేత గంజి యుగేందర్‌ ఆసియా బెస్ట్‌ హ్యాండ్లూమ్‌ అవార్డు అందుకున్నారు.

6. 2023 సంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌గా జై షా ఎంపికయ్యాడు. 

Daily Current Affairs in Telugu: 01 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 06 Dec 2023 07:44AM

Photo Stories