TCS CEO: టీసీఎస్ కొత్త సీఈఓ ఎవరంటే... ఆయన శాలరీ ఎన్ని కోట్లంటే...
ఎవరీ కృతివాసన్...
చెన్నైకి చెందిన కృతివాసన్ 1989లో టీసీఎస్‌లో చేరారు. 34 సంవత్సరాల నుంచి కంపెనీకి సేవలందిస్తున్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐటీ కాన్పూర్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. టీసీఎస్‌లో కీర్తివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ సేల్స్‌లో వివిధ బాధ్యతలు నిర్వహించారు.
కృతివాసన్ శాలరీ....
ఊ దేశంలోని వివిధ కంపెనీల సీఈఓల వేతనాలతో పోల్చితే కృతివాసన్ వార్షిక వేతనం ఎంతనేది ఇప్పటివరకు స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే 2021-22లో ఆయన వేతనం రూ. 25.75 కోట్లు కాగా, 2023కి 30 శాతం పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో శాలరీ భారీగానే పెరగనున్నట్లు సమాచారం.
చదవండి: పీఎం మోదీతో సీఎం జగన్ భేటీ