ఫిబ్రవరి 2019 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
భారత్- దక్షిణ కొరియాల మధ్య ఆరు ఒప్పందాలు
భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియా కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన పర్యటనలో రెండో రోజైన ఫిబ్రవరి 22న మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్‌తో కలిసి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహాకారం పెంపొందించే దిశగా చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియానుఒక విలువైన భాగస్వామిగా మేం భావిస్తామన్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచేందుకు గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు.అంతకుముందు మూన్-జే-ఇన్ అధికారిక నివాసం, కార్యాలయం వద్ద మోదీకి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్- దక్షిణ కొరియాల మధ్య ఆరు ఒప్పందాలు
ఎవరు: భారత్ ప్రధాని మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్
ఎప్పుడు : ఫిబ్రవరి 22న
ఎక్కడ : దక్షిణ కొరియా (సియోల్)
పాకిస్తాన్‌లో భారత్ మెరుపు దాడులు
పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్, చకోటిలలో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) శిబిరాలపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న మెరుపు దాడులు(సర్జికల్ స్ట్రయిక్స్) చేసింది. వెయ్యి పౌండ్ల బరువైన బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు, వారి శిక్షకుల్ని వాయుసేన మట్టుపెట్టింది. 1971 యుద్ధం తరువాత పాకిస్తాన్ భూభాగంలో భారత్ వైమానిక దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి. ఈ మెరుపు దాడల్లో భారత్ 12 మిరాజ్ -2000 యుద్ధ విమానాలను ఉపయోగించింది.
భారత్‌లో జైషే మహ్మద్ నుంచి పొంచి ఉన్న ఆత్మహుతి దాడుల ప్రమాదాన్ని అడ్డుకునేందుకు ఆ సంస్థ స్థావరాలపై దాడి తప్పనిసరి అయి్యందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ సందర్భంగా వెల్లడించారు. నిర్దిష్టంగా జైషే శిబిరాన్నే లక్ష్యంగా చేసుకొని సైనికేతర దాడి చేశామని చెప్పారు. 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ కేంద్రంగా పని చేసే ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేసి 40 మంది ధీర జవాన్లను బలిగొంది.
మిరాజ్-2000 విశేషాలు...
ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ కంపెనీ నుంచి భారత్ 1990లో మిరాజ్-2000 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. తర్వాత కాలంలో ఈ యుద్ధవిమానాలకు నూతన సాంకేతికతను జోడించారు.
ఏమిటి : భారత వాయుసేన మెరుపు దాడులు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : బాలకోట్ ,
ఎక్కడ : బాలాకోట్, ముజఫరాబాద్, చకోటిలలో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) శిబిరాలపై
భారత్‌లో పాక్ వైమానిక దాడులు
జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా, పూంచ్ సెక్టార్లలో పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫిబ్రవరి 27న దాడులకు తెగబడటంతో భారత బలగాలు పాక్ వాయుసేనను దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాక్ ఫైటర్ జెట్ ఎఫ్-16ను గాల్లోనే కూల్చివేశాయి. పాక్ యుద్ధ విమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానానాన్ని పాక్ కూల్చివేసింది. అలాగే ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్ తెలిపింది. అదుపులోకి తీసుకున్న పైలట్ అభినందన్‌ను సురక్షితంగా విడుదల చేయాలని, ‘జెనీవా’ నిబంధనల ప్రకారం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పాక్‌కు భారత్ సూచించింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య తలెత్తిన తాజా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ వైమానిక దాడులు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎక్కడ : నౌషెరా, పూంచ్ సెక్టార్లు, జమ్మూకశ్మీర్
పాకిస్తాన్ ఇచ్చిన ఎంఎఫ్‌ఎన్ హోదా రద్దు
పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత అనుకూల దేశం(మోస్ట్ ఫేవర్డ్ నేషన్-ఎంఎఫ్‌ఎన్)’ హోదాను భారత్ రద్దుచేసింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఫిబ్రవరి 15న భేటీ అయిన కేబినెట్ భద్రతా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకి స్తాన్ నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాలు పెంచే అవాకాశం ఉంది. సుమారు 49కోట్ల డాలర్ల పాకిస్తాన్ ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. పాకిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ప్రధానంగా ముడిపత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్, రంగులు తదితరాలున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సభ్యదేశాలు తమలో తాము వివక్షాపూరిత వాణిజ్య విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ఎంఎఫ్‌ఎన్ హోదాను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ హోదా కలిగిన దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉంటాయి. పాకిస్తాన్‌కు అత్యంత అనుకూల దేశం హోదాను భారత్ 1996లో ఇవ్వగా, ఇంకా భారత్‌కు పాకిస్తాన్ ఆ హోదా ఇవ్వలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ ఇచ్చిన ఎంఎఫ్‌ఎన్ హోదా రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత్
ఎందుకు : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో
పాకిస్తాన్ వస్తువులపై 200 శాతం పన్ను పెంపు
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీను 200 శాతం పెంచుతున్నట్లు ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు తదితరాలున్నాయి. 2017-18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ వస్తువులపై 200 శాతం పన్ను పెంపు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో
అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు
భారత్‌లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మాక్రితో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18న చర్చలు జరిపారు. ఈ సంద ర్భంగా రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో సహకారానికి సంబంధించిన పది ఒప్పందాలను ఇరుదేశాధినేతలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలన్నీ సహకరించు కునే వేదిక(కాంప్రిహెన్సివ్ కాన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టైజం) ఏర్పాటుకు ఈ మోదీ, మాక్రి మద్దతు ప్రకటించారు. అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఇద్దరు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మాక్రితో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎక్కడ : న్యూఢిల్లీ
భారత్‌కు క్షిపణి వ్యవస్థలను అమ్మేందుకు అమెరికా ఆమోదం
భారత్‌కు అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్‌మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్‌గా పిలిచే ఈ వ్యవస్థల అమ్మకానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఫిబ్రవరి 7న తెలిపింది. సుమారు రూ.1,355 కోట్లు విలువైన ఈ రెండింటి కొనుగోళ్ల ద్వారా భారత రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలకు అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
భారత రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ విమానాలకు ఈ ఆధునిక వ్యవస్థలను అమర్చితే అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంతో సమానమైన పటిష్టమైన భద్రత కలుగుతుంది. ఈ వ్యవస్థలను అమర్చేందుకు 2 బోయింగ్-777 ఈఆర్ విమానాలను ఎయిరిండియా నుంచి కొననున్నారు. ప్రమాద సమయంలో మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థలపై దానంతటదే ప్రతిదాడి చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకతల్లో ఒకటి. ఈ కొనుగోళ్లలో ప్రధాన కాంట్రాక్టర్‌గా బోయింగ్ కంపెనీ వ్యవహరించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను అమ్మేందుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : అమెరికా
భారత్‌కు చేరిన చినూక్ హెలికాప్టర్లు
అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు మొదటి దఫా అందాల్సిన నాలుగు చినూక్ సైనిక హెలికాప్టర్లు భారత్‌కు చేరాయి. గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయానికి ఫిబ్రవరి 10న చేరిన నాలుగు సీహెచ్47ఎఫ్(ఐ) రకం హెలికాప్టర్లను త్వరలోనే చండీగఢ్ ఐఏఎఫ్ స్థావరానికి తరలిస్తామని బోయింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్ హెలికాప్టర్లను భారత్‌కు బోయింగ్ సమకూర్చాల్సి ఉంది. బలగాలను, సైనిక సామగ్రిని, ఇంధనాన్ని తరలించడంతోపాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఈ హెలికాప్టర్లు ఎంతో అనుకూలమైనవి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు చేరిన చినూక్ హెలికాప్టర్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : బోయింగ్ సంస్థ
ఎక్కడ : ముంద్రా నౌకాశ్రయం, గుజరాత్
అమెరికా నుంచి 72400 రైఫిల్స్ కొనుగోలు
అమెరికా రక్షణ రంగ సంస్థ సిగ్ సార్ నుంచి 72,400 అధునాతన రైఫిళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు ఫిబ్రవరి 12న వెల్లడించారు. ఇందుకోసం ఇందుకోసం రూ.700 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. అమెరికా, యూరప్ దేశాల సైనికులు వినియోగిస్తున్న ఆ రైఫిళ్లను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా సిగ్ సార్ నుంచి ఏడాది వ్యవధిలో 72,400 7.62 ఎంఎం రైఫిల్స్ భారత సైన్యానికి అందుతాయి. ప్రస్తుతం భారత సైనికులు 5.56x45 ఎంఎం ఇన్‌సాస్ రైఫిల్స్‌ను వాడుతున్నారు. ఈ ఆయుధాలను చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అందించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిగ్ సార్ సంస్థ నుంచి 72,400 అధునాతన రైఫిళ్లు కొనుగోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : భారత రక్షణ శాఖ
భారత్ ఎన్‌పీటీపై సంతకం చేయాలి : చైనా
అణు సరఫరాదారుల గ్రూప్(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం కావాలంటే భారత్ అణు నిరాయుధీకరణ ఒప్పందం(ఎన్‌పీటీ)పై సంతకం చేయాల్సిందేనని చైనా స్పష్టం చేసింది. ఎన్‌పీటీపై సంతకం చేయనందున భారత్ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అణు నిరాయుధీకరణ, అణు సాంకేతికతను శాంతియుత ప్రయోజనానికి వాడటం తదితర అంశాలపై అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ లు బీజింగ్‌లో సమావేశమయ్యాయి. ఈ భేటీ ముగిసిన నేపథ్యంలో జనవరి 31న చైనా ఈ విషయం తెలిపింది.
మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ సుముఖత
బ్యాంకుల వద్ద వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావీద్ ఫిబ్రవరి 3న సంబంధింత పత్రాలపై సంతకం చేశారు. అయితే ఈ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఫిబ్రవరి 4 నుంచి 14 రోజులపాటు మాల్యాకు గడువుంది. మాల్యా భారత్‌లో ఓ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉందనీ, ఆయనను భారత్‌కు తిరిగి పంపించాలని తీర్పునిస్తూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోరు 2018, డిసెంబర్ 10న తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సుముఖత
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : బ్రిటన్
భారత్‌లో నేపాల్ రాయబారిగా నీలాంబర్
భారత్‌లో నేపాల్ రాయబారిగా ఆ దేశ మాజీ న్యాయశాఖ మంత్రి నీలాంబర్ ఆచార్య నియమితులయ్యారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో ఫిబ్రవరి 3న జరిగిన కార్యక్రమంలో నీలాంబర్‌తో ఆ దేశ రాష్ట్రపతి బిద్యాదేవి భండారి ప్రమాణం చేయించారు. మాస్కో వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆచార్య మొదట్లో వామపక్ష భావజాలంతో ఉన్నా తర్వాత నేపాలీ కాంగ్రెస్‌లో చేరారు. 1990లో తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, సామాజిక సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. భారత్‌లో నేపాల్ రాయబారిగా ఉన్న దీప్‌కుమార్ ఉపాధ్యాయ ఏడాదిన్నర క్రితం రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో నేపాల్ రాయబారి నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : నీలాంబర్ ఆచార్య

- పొడవు 14.36 మీటర్లు
- రెక్కల నిడివి 91.3 మీటర్లు
- బరువు 7,500 కిలోలు
- క్షిపణులతో కలిపి గరిష్ట బరువు 17,000 కిలోలు
- గరిష్ట వేగం గంటకు 2,336 కి.మీ.
- ఎగరగలిగే గరిష్ట ఎత్తు 17 కిలోమీటర్లు

Published date : 26 Feb 2019 01:30PM