మార్చి 2019 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య ఇండిగో సర్వీస్
ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో నూతన సర్వీసును ప్రారంభించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌కు 22 సీట్లు కలిగిన ఏ321నియో విమానాన్ని కేటాయించినట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ మార్చి 22న తెలిపారు. ఆరు నూతన సర్వీసులను ప్రారంభించేందుకు తమకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ చేరుకోవడానికి సాధారణంగా ఏడు గంటల సమయం పట్టనుండగా.. పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేసిన కారణంగా ప్రస్తుతానికి పదకొండు గంటల సమయం పడుతుంది. భారత విమానయాన సేవల్లో 40 శాతం మార్కెట్ వాటాను కలిగిన ఇండిగో మరో 125 ఏ321నియో విమానాలను జోడించాలని భావిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య నూతన విమాన సర్వీస్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : ఇండిగో
భారత్‌కు వ్యతిరేకంగా డబ్ల్యూటీవోకు గ్వాటెమాల
చక్కెర రైతులకు భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్వాటెమాలా ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూటీవో)ను ఆశ్రయించింది. డబ్ల్యూటీవో చట్టాల కింద భారత్‌తో సంప్రదింపులు జరపాలని ఆ దేశం కోరింది. ఇప్పటికే బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇదే విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలను డబ్ల్యూటీవోలో సవాలు చేశాయి.
మిత్ర శక్తి సైనిక వ్యాయామం ప్రారంభం
మిత్ర శక్తి-6 పేరుతో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక వ్యాయామం మార్చి 26న ప్రారంభమైంది. శ్రీలంకలోని డియాతలవాలో 2019, ఏప్రిల్ 8 వరకు ఈ సైనిక వ్యాయామాన్ని నిర్వహించనున్నారు. ఇరు దేశాల సైన్యాల మధ్య సహకారం, అవగాహనను పెంపొందించడ ం కోసం దీనిని నిర్వహిస్తున్నారు. దక్షిణాసియాలో నిర్వహించే పెద్ద ద్వైపాక్షిక సైనిక వ్యాయామాల్లో మిత్రశక్తి కూడా ఒకటి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిత్ర శక్తి-6 సైనిక వ్యాయామం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : భారత్-శ్రీలంకం
ఎక్కడ : డియాతలవా, శ్రీలంక
గినియా ప్రధానితో రాష్ట్రపతి సమావేశం
భారత పర్యటనకు వచ్చిన గినియా ప్రధాన మంత్రి ఇబ్రహీమా కస్సారీ ఫోఫనాతో మార్చి 18న ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. భారత్-గినియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 900 మిలియన్ డాలర్లకు చేరుకుందని రాష్ట్రపతి అన్నారు. గినియాతో అత్యుత్తమైన భాగస్వామ్య దేశాలలో భారత్ ఒకటని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గినియా ప్రధానితో రాష్ట్రపతి సమావేశం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఇబ్రహీమా కస్సారీ ఫోఫనా, రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఇడాయ్ తుపాన్ కోసం మూడు నౌకలు
ఇడాయ్ తుపాన్ ప్రభావం వల్ల అతలాకుతలమైన మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వే దేశాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ మూడు నౌకలను ఆయా దేశాలకు పంపి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. మొజాంబిక్ దేశం చేసిన వినతి మేర స్పందించిన భారత్ ఆహారం, దుస్తులు, ఔషధాలతో కూడిన మూడు నౌకలను బెయిరా నౌకాశ్రయానికి పంపించింది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి టీఎస్ తిరుమూర్తి మార్చి 18న తెలిపారు. 1.5 మిలియన్ల మంది ఇడాయ్ తుపాన్ బారిన పడ్డారని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూడు నౌకల్లో సహాయ సామగ్రి
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : భారత్
ఎందుకు : ఇడాయ్ తుపాన్ ప్రభావం వల్ల అతలాకుతలమైన మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వే దేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం
అర్జెంటీనా ఉపాధ్యక్షురాలుతో ఉపరాష్ట్రపతి భేటీ
అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు గాబ్రియెలా మిషెట్టితో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్చి 12న ఢిల్లీలో భేటీ అయ్యారు. భారత్-అర్జెంటీనా మధ్య సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సంద ర్భంగా వెంకయ్య-గాబ్రియెలా నిర్ణయించారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్‌కు ఎప్పుడూ తమ దేశం మద్దతు ఉంటుందని గాబ్రియెటా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వైకల్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజల సాధికారతకు అర్జెంటీనా అధ్యక్షుడు మార్షియో మాక్రి చేస్తున్న ప్రయత్నాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. 2019, జూన్‌లో అర్జెంటీనాలో నిర్వహించనున్న గ్లోబల్ డిజెబిలిటీ కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని గాబ్రియెలా ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అర్జెంటీనా ఉపాధ్యక్షురాలుతో ఉపరాష్ట్రపతి భేటీ
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : గాబ్రియెలా మిషెట్టి, వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఢిల్లీ
సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు నిలుపుదల
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నడిచే సంరతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ఫిబ్రవరి 28న తాత్కాలికంగా నిలిచిపోయాయి. తొలుత ఈ రైల్వే సేవలను నిలిపేస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకోగా, ఆ తర్వాత భారత్ కూడా సంరతాను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 1971లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సంరతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు 1976 జూలై 22న ప్రారంభమయ్యాయి. పాక్‌లోని లాహోర్ నుంచి ప్రతి సోమవారం, గురువారం బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు కూడా అట్టారీ స్టేషన్ వరకు వెళ్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు తాత్కలికంగా నిలుపుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : భారత్-పాకిస్తాన్
ఎందుకు : భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో
భారత్‌కు ప్రాధాన్య హోదా తొలగిస్తాం : ట్రంప్
భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మార్చి 5న అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌కు లేఖ అందజేశారు. అమెరికా కాంగ్రెస్, భారత ప్రభుత్వానికి దీనిపై నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో అమల్లోకి వస్తుంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్‌పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఏమిటీ వాణిజ్య ప్రాధాన్య హోదా?
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్‌పీ)ను 1976లో అమెరికా రూపొందించింది. దీని ప్రకారం 129 అభివృద్ధి చెందుతున్న దేశాలను గుర్తించి ఆయా దేశాల నుంచి ఎగుమతి అయ్యే 4,800 రకాల ఉత్పత్తులకు సుంకాలు విధించరాదని నిర్ణయించింది. 1974 వాణిజ్య చట్టం విధివిధానాలకు అనుగుణంగా 1976లో ఈ వాణిజ్య హోదాను ప్రవేశపెట్టింది. ఈ హోదా ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. వాణిజ్య హోదా అనుభవిస్తున్న దేశం తమ దేశీయ మార్కెట్లలో అమెరికా సులభంగా ప్రవేశించడానికి కూడా వీలు కల్పించాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా తొలగిస్తాం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : అమెరికా
పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి సమావేశం
పరాగ్వే అధ్యక్షుడు మారియో అబ్దో బెనిటెజ్‌తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్చి 6న సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలసి రావాలని బెనిటెజ్‌ను ఉపరాష్ట్రపతి కోరారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని బెనిటెజ్‌తో కలిసి స్మారక తపాలా బిళ్ల విడుదల చేశారు. పరాగ్వే ఉపాధ్యక్షుడు హ్యూగో వెలాజ్‌క్వెజ్‌తో ఉపరాష్ట్రపతి భేటీ సందర్భంగా... వ్యవసాయం, ఫార్మాస్యూటికల్, కెపాసిటీ బిల్డింగ్, ఐసీటీ, అంతరిక్ష విజ్ఞానం, రైల్వేలకు సంబంధించిన కీలక అంశాల్లో భాగస్వామ్యానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి సమావేశం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : మారియో అబ్దో బెనిటెజ్-వెంకయ్యనాయుడు
ఎక్కడ : పరాగ్వే

Published date : 13 Mar 2019 05:22PM