Skip to main content

జనవరి 2021 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్, చైనా మధ్య 9వ విడత మిలటరీ చర్చలు ఎక్కడ జరిగాయి?
Current Affairs
తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయిలో 9వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద జనవరి 24న ఈ చర్చలు జరిగాయి. చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మెనన్, చైనా ప్రతినిధులకు దక్షిణ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ సారథ్యం వహించారు. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. 2020, నవంబర్ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి.
తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని భారత ఆర్మీ తెలిపింది. చైనా ప్రతిపాదన మేరకే 2020, సెప్టెంబర్ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో ఈ ఒప్పందం కుదిరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా, భారత్ తొమ్మిదో విడత మిలటరీ చర్చలు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్, జనరల్ లియూ లిన్
ఎక్కడ : చూశుల్ సెక్టార్, తూర్పు లద్దాఖ్, భారత్-చైనా సరిహద్దు
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం

సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ
ఉత్తర సిక్కింలోని 16 వేల అడుగుల ఎత్తైన నాకు లా ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘర్షణల్లో 20 మంది చైనా సైనికులు, నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని జనవరి 25న భారతీయ సైన్యం వెల్లడించింది. ఇరు దేశాల స్థానిక కమాండర్లు ఈ సమస్యను పరిష్కరించారని తెలిపింది. జనవరి 20న ఉత్తర సిక్కింలోని నాకు లా వద్ద వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. భారత సైనికులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీనిపై తమ వద్ద సమాచారం లేదని చైనా పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, చైనా సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ
ఎప్పుడు : జనవరి 20
ఎక్కడ : నాకు లా ప్రాంతం, ఉత్తర సిక్కిం, భారత్-చైనా సరిహద్దు
ఎందుకు : భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించడంతో

భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకున్న బ్రిటన్ సంస్థ?
ఔషధ తయారీలో ఉన్న బ్రిటన్ సంస్థ జీఎస్‌కే(గ్లాక్సోస్మిత్‌క్లైన్)... మలేరియా వ్యాక్సిన్ల తయారీని భారత్‌లో చేపట్టనుంది. ఇందుకోసం వ్యాక్సిన్ల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా మలేరియా టీకా(ఆర్‌టీఎస్, ఎస్/ఏఎస్01) తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోకు జీఎస్‌కే బదిలీ చేస్తుంది. అలాగే టీకా తయారీలో ఉపయోగించే సహాయ ఔషధాన్ని సరఫరా చేస్తుంది.
పైలట్ ప్రాజెక్టు కింద...
మలేరియా వ్యాక్సిన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా.. ప్రస్తుతం జీఎస్‌కే మలేరియా టీకాను ‘పాత్’ అనే యూఎస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థతో కలిసి ఘనా, కెన్యా, మలావి ప్రాంతాల్లోని ప్రజలకు పైలట్ ప్రాజెక్టు కింద ఒక కోటి డోసులను అందిస్తోంది.
మలేరియా వ్యాధి కారకము...
మలేరియా దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్లాస్మోడియం(Plasmodium) అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకున్న బ్రిటన్ సంస్థ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : జీఎస్‌కే(గ్లాక్సోస్మిత్‌క్లైన్)
ఎందుకు : మలేరియా వ్యాక్సిన్ల తయారీని భారత్‌లో చేపట్టేందుకు

ఏ రాష్ట్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది?
Current Affairs
డ్రాగన్ దేశం చైనా.. భారత భూభాగంలో ఒక కొత్త గ్రామాన్నే నిర్మించింది. 2020, నవంబర్ 1వ తేదీ నాటి శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబాన్‌సిరి జిల్లాలో త్సరి చూ నది(Tsari Chu) ఒడ్డున ఈ గ్రామాన్ని చైనా నిర్మించింది. ఇక్కడ 101 ఇళ్లు ఉన్నాయి. ఇరు దేశాల సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఇళ్లు నిర్మించారు.
అధికారిక మ్యాప్‌ల ప్రకారం....
భారత ప్రభుత్వ అధికారిక మ్యాప్‌ల ప్రకారం చైనా నిర్మించిన గ్రామం భారతదేశ భూభాగమే. అయితే, ఈ ప్రాంతం 1959 నుంచి చైనా అధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ చైనా మిలటరీ పోస్టు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక కొత్త ఊరే పుట్టుకొచ్చింది. ఈ ప్రాంతంపై భారత్-చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. 2019 ఆగస్టు 26 నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే త్సరి చూ నది ఒడ్డున ఎలాంటి నిర్మాణాలు లేవు. అంటే 2020 ఏడాదే ఈ కొత్త గ్రామాన్ని చైనా నిర్మించినట్లు స్పష్టమవుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వివాదాస్పద ప్రాంతంలో కొత్త గ్రామం నిర్మాణం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : చైనా
ఎక్కడ : త్సరి చూ నది(Tsari Chu) ఒడ్డున, అప్పర్ సుబాన్‌సిరి జిల్లా, అరుణాచల్ ప్రదేశ్

భారత్ నుంచి భూటాన్, మాల్దీవులకు కరోనా టీకాలు
‘పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం’ అనే తన విధానంలో భాగంగా భూటాన్, మాల్దీవులకు భారత్ కరోనా టీకాలు సరఫరా చేసింది. గ్రాంట్స్ అసిస్టెన్స్ కింద జనవరి 20న భూటాన్‌కు 1,50,000 కోవిషిల్డ్ వ్యాక్సిన్ డోసులు, మాల్దీవులకు లక్ష డోసులను అందజేసింది. అలాగే జనవరి 21న బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులు, నేపాల్‌కు 10 లక్షల డోసులను సరఫరా చేసింది. ఈ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ‘‘వ్యాక్సిన్ మైత్రి’’గా భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సంభోదించారు. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, మారిషస్ దేశాలకు టీకాలను సరఫరా చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

అణ్వాయుధ వివరాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాకిస్తాన్
Current Affairs
ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్, పాకిస్తాన్ దేశాలు వార్షిక అణ్వాయుధ నిల్వలు, అణ్వాయుధ నిర్మాణాల వివరాలను పరస్పరం వెల్లడించుకున్నాయి. ఇరు దేశాలు 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతి యేటా జనవరి 1వ తేదీన అణ్వాయుధ సంపత్తికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేస్తారు. కాగా పాకిస్తాన్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న 49 మంది సాధారణ పౌరులతో సహా 270 మంది జాలర్ల వివరాలను పాక్ వెల్లడించింది. అందుకు బదులుగా భారత్ సైతం భారతీయ జైళ్ళలో ఉన్న 340 మంది పాకిస్తాన్ ఖైదీల వివరాలను వెల్లడించింది.
భారత్-యూఏఈ...
భారత్‌లో 2021 నూతన సంవత్సర వేడుకలను గుర్తు చేసేలా యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) కూడా సంబరాలు చేసుకుంది. యూఏఈలో దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన భవనం ‘‘బుర్జ్ ఖలీఫా’’ భవనంపై భారతీయ జెండాను ప్రదర్శిస్తూ ఈ వేడుకలను జరిపింది.
యూఏఈ రాజధాని: అబూదాబి; కరెన్సీ: దిర్హం
యూఏఈ ప్రస్తుత అధ్యక్షుడు: ఖలీఫా బిన్ జాఝెద్ అల్ నహ్యాన్
యూఏఈ ప్రస్తుత ఉపాధ్యక్షుడు, ప్రధాని: మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్
క్విక్ రివ్యూ:
ఏమిటి : వార్షిక అణ్వాయుధ నిల్వలు, అణ్వాయుధ నిర్మాణాల వివరాలను పరస్పరం వెల్లడించుకున్న దేశాలు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : భారత్, పాకిస్తాన్
ఎందుకు : ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా

బ్రిటన్ ప్రధానమంత్రి భారత పర్యటన వాయిదా
2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు హాజరు కావాల్సిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పర్యటనని వాయిదా వేసుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జనవరి 5న ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బ్రిటన్‌లో కొత్త కరోనా కేసులు ఉధృతరూపం దాల్చడంతో తాను భారత్‌కి రాలేకపోతున్నానని మోదీ తెలిపారు. అయితే యూకే ఆధ్వర్యంలో 2021 ఏడాది చివర్లో జరిగే జీ-7 సదస్సు కంటే ముందుగానే భారత్‌కి వస్తానని చెప్పారు.
Published date : 12 Feb 2021 03:17PM

Photo Stories