Skip to main content

జనవరి 2019 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్-దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సులో మోదీ
Current Affairs న్యూఢిల్లీలో జనవరి 25న ఇండస్ట్రీ చాంబర్- సీఐఐ నిర్వహించిన భారత్-దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. 2.6 ట్రిలియన్ డాలర్లతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తరువాత ఉన్న భారత్ త్వరలో ఐదో స్థానానికి ఎదుగుతుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడుల పురోగతికి నిరంతర చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ వివరించారు.
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం 150కిపైగా భారత్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌పోసా పేర్కొన్నారు. వ్యవసాయం, ఐసీటీ, ఎయిరోస్పేస్, ఇంధనం, ఫార్మా, రక్షణ, మౌలిక, మైనింగ్, క్రియేటివ్ రంగాల్లో పరస్పరం సహకరించుకోడానికి రెండు దేశాలకూ చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సు
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : న్యూఢిల్లీ
ఎక్కడ : ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా

నేపాల్‌లో భారతీయ కరెన్సీపై నిషేధం
Current Affairs నేపాల్‌లో రూ. 100 పై విలువ కలిగిన భారతీయ కరెన్సీపై నేపాల్ కేంద్ర బ్యాంకు జనవరి 20న నిషేధం విధించింది. దీంతో నేపాల్‌లో రూ. 200, రూ. 500 రూ. 2,000 నోట్లను వాడుకోవడానికి వీలుండదు. అయితే వంద, అంత కంటే తక్కువ విలువ చేసే భారత కరెన్సీని వాడుకోవచ్చని నేపాల్ బ్యాంక్ పేర్కొంది. భారత కరెన్సీలోని పెద్ద నోట్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నామని 2018, డిసెంబరు 13న నేపాల్ కేబినెట్ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 100 పై విలువ కలిగిన భారతీయ కరెన్సీపై నిషేధం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : నేపాల్ కేంద్ర బ్యాంకు
ఎక్కడ : నేపాల్

జపాన్‌తో ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటుకు ఆమోదం
Current Affairs జపాన్‌తో 75 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జనవరి 10న ఆమోదం తెలిపింది. దీంతో స్వాప్ ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ జపాన్‌తో ఆర్‌బీఐ ఒప్పందం చేసుకునేందుకు అధికారం కల్పించినట్లయింది. ఈ ఒప్పందం కారణంగా కరెన్సీ పరంగా స్థిరత్వం ఏర్పడి, భారత కంపెనీలు విదేశీ నిధులను సులభంగా పొందే అవకాశాలు మెరుగుపడనున్నాయి.
మరోవైపు నూతన, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్, ఫ్రాన్స్ మధ్య సాంకేతిక సహకారం పెంపొందించే ఒప్పందానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్‌తో ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : కేంద్ర కేబినెట్

నార్వే వ్యాపార సదస్సులో 15 ఒప్పందాలు..
Current Affairs భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నార్వే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 1.2 బిలియన్ డాలర్ల (రూ.8,356 కోట్లు) వాణిజ్యం జరుగుతుండగా, ఇది మరింత పెరగాలని భావిస్తున్నట్లు ఆదేశ ప్రధాని ఎమ్మా సోల్బర్గ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రారంభమైన ఇండియా-నార్వే మూడురోజుల వ్యాపార సదస్సులో పాల్గొన్న ఆమె.. ‘నూతన వ్యూహాలను అనుసరించటం ద్వారా మా దేశంతో భారత్ కొనసాగిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం. ప్రైవేటు రంగంతో కలిసిపనిచేయడం, పరిశోధన, సాంకేతిక సహకారం పెంపొందే దిశగా చర్చిస్తున్నాం. ఇక్కడ మా దేశ కంపెనీలకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా ఎనర్జీ రంగంలో అవకాశాలు చాలా ఉన్నట్లు గుర్తించాం. గ్రామీణ ప్రాంత ఆధారిత వాణిజ్యాన్ని కోరుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు హాజరైన వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ.. ‘కీలక ఒప్పందాలపై జనవరి 7న ఇరుదేశాలు సంతకాలు పూర్తిచేయనున్నాయి. తద్వారా నార్వేతో వ్యాణిజ్యం మరింత ముందుకు సాగనుందని భావిస్తున్నాం.’ అని చెప్పారు. ఈ సదస్సులో.. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎనర్జీ, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఆక్వాకల్చర్‌కు చెందిన 15 కంపెనీలు ప్రధాని మోదీ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశాయి.
శ్రేయీతో ఒప్పందం...
శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రేయీ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్.. నార్వే ప్రభుత్వానికి చెందిన ఎక్స్‌పోర్ట్‌క్రెడిట్ నార్గేతో (ఈసీఎన్) ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సులో ఇరు సంస్థల మధ్య ఎంఓయూలపై సంతకాలు పూర్తయ్యాయి. ‘ఒప్పందం ప్రకారం.. నార్వేజియన్ కాపిటల్ గూడ్‌‌స దిగుమతి, ఎక్విప్‌మెంట్ తయారీకి శ్రేయీ ఎక్విప్‌మెంట్‌కు ఆదేశం సహయసహకారాలతో పాటు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్‌ను అందించనుంది.’ అని సంస్థ చైర్మన్, ఎండీ హేమంత్ కనోరియా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్- నార్వే దేశాల మధ్య వాణిజ్యా ఒప్పందాలు
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: నార్వే ప్రధాని ఎమ్మా సోల్బర్గ్
ఎందుకు: భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా
ఎక్కడ: న్యూఢిల్లీ

ప్రధాని మోదీతో నార్వే ప్రధాని సోల్బెర్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో భారత పర్యటనకు వచ్చిన ఉన్న నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్ న్యూఢిల్లీలో జనవరి 8న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విసృ్తతం చేసుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. సముద్ర ఆర్థిక వ్యవస్థపై 2 దేశాల సంప్రదింపులకు వీలు కల్పించే ఎంవోయూపై సంతకాలు చేశారు. భారత్‌లో రూ.84వేల కోట్ల (12 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు నార్వే ప్రధాని అంగీకరించారని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
ఎప్పుడు : జనవరి 8
ఎక్కడ : న్యూఢిల్లీ

భూటాన్ కు 4500 కోట్ల సాయం
భూటాన్‌లో 12వ పంచవర్ష ప్రణాళిక అమలు చేసేందుకు రూ.4,500 కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. న్యూఢిల్లీలో డిసెంబర్ 28న భూటాన్ ప్రధాని లోతే షెరింగ్‌తో భేటీ అయిన మోదీ ఈ మేరకు ప్రకటించాడు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... జల విద్యుత్ సహకారం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో కూడా లోతే భేటీ అయ్యారు.
భూటాన్‌లో 2018, నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లోతే షెరింగ్ ప్రధాని అయిన తర్వాత తొలి విదేశీ పర్యటన కోసం భారత్‌కు వచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూటాన్ కు రూ. 4,500 కోట్ల సాయం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
Published date : 28 Jan 2019 12:08PM

Photo Stories