Skip to main content

YSR Lifetime Achievement awards: వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల‌ను ప్రకటించిన‌ ఏపీ ప్రభుత్వం

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పేరు మీద అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్, ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు.
 Outstanding Achievements, YSR Lifetime Achievement awards,YSR Lifetime Achievement Award Recipient
YSR Lifetime Achievement awards

 సామాన్యుల్లో అసామాన్యులకు, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్రవేసిన వారికి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుల్ని అందించడం ఇది వరుసగా మూడో ఏడాది.

69th National Film Awards ceremony 2023: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్ర‌దానం చేసిన‌ రాష్ట్రపతి

2023లో వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపికయిన వారి జాబితా:

వ్యవసాయం:

1)పంగి వినీత– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
2వై.వి.మల్లారెడ్డి– అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:

1) యడ్ల గోపాలరావు-రంగస్థల కళాకారుడు-శ్రీకాకుళం
2) తలిసెట్టి మోహన్‌– కలంకారీ–  తిరుపతి
3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల
4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ– కాకినాడ
6) ఎస్‌.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా 
7)బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు 
8)తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం
9)చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం
10)కలీసాహెబీ మహబూబ్‌– షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం

తెలుగు భాష– సాహిత్యం:

1) ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి
2) ఖదీర్‌ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
3) మహెజబీన్‌– నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం

క్రీడలు:

1) పుల్లెల గోపీచంద్‌– గుంటూరు
2) కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం
వైద్యం:
1)  ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్‌ 
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌– వైయస్సార్‌ 

మీడియా:

1) గోవిందరాజు చక్రధర్‌– కృష్ణా
2)  హెచ్చార్కే– కర్నూలు

సమాజ సేవ:

1)బెజవాడ విల్సన్‌– ఎన్టీఆర్‌
2) శ్యాం మోహన్‌– అంబేద్కర్‌ కోనసీమ– (ఎచీవ్‌మెంట్‌)
3) నిర్మల హృదయ్‌ భవన్‌– ఎన్టీఆర్‌
4)జి. సమరం– ఎన్టీఆర్‌ 

Nobel Prize 2023 Winners List: నోబెల్ బహుమతి-2023 విజేతల పూర్తి జాబితా ఇదే...

Published date : 20 Oct 2023 11:28AM

Photo Stories