Union Bank of India: రాజభాష కీర్తి పురస్కార్ గెలుచుకున్న బ్యాంక్?
హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు 2018–19, 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ‘రాజభాష కీర్తి పురస్కార్’ను దక్కించుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ సెప్టెంబర్ 15న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనలైజ్డ్ బ్యాంకు విభాగంలో.. 2019–20లో మొదటి బహుమతిని, 2020–21 లో తృతీయ బహుమతిని అందుకుంది. హౌస్ మేగజైన్ విభాగంలో 2018–19లో.. సంస్థ అంతర్గత మేగజైన్ ‘యూనియన్ శ్రీజన్’కు రెండో బహుమతి లభించింది. ఇలా అధికారిక భాష అమలులో 5 అవార్డులను బ్యాంకు దక్కించుకుంది.
రజిత ప్రియకు కౌశలాచార్య అవార్డు
‘స్కిల్ ఇండియా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, శిక్షణ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ చాటిన 41 మంది శిక్షకులకు కౌశలాచార్య–2021 అవార్డులను లభించాయి. అవార్డులను అందుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వై.రజిత ప్రియ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీటిని సెప్టెంబర్ 17న వర్చువల్ విధానంలో అందజేశారు.
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డులు...
విభిన్న రంగాల్లో విజయాలు సాధించినవారిని గుర్తించి పురస్కారాలు అందించే ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి పాల్గొన్నారు.
చదవండి: సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు-2020కు ఎంపికైన శాస్త్రవేత్త?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రాజభాష కీర్తి పురస్కార్(2018–19, 2019–20, 2020–21) ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ
ఎందుకు : అధికార భాష హిందీని విజయవంతంగా అమలు చేసినందుకు...