Mauritius Govt: మారిషస్ స్టార్ పురస్కారానికి ఎంపికైన తెలుగు వ్యక్తి?
మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషా యోధుడు సంజీవ నరసింహ అప్పడుకు ‘ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవమైన మార్చి 12వ తేదీన తొమ్మిది మంది ప్రముఖులను ఈ పురస్కారానికి అక్కడి ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ చేతుల మీదుగా సంజీవ నరసింహ ఈ అవార్డును అందుకోనున్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన విశేష కృషి చేశారు. ఈ పురస్కారం భారత దేశంలోని ‘పద్మ’ పురస్కారాలతో పోల్చదగినది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలలో సామాజిక పురోగతికి కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డులను అందజేస్తారు.
AGA: విశిష్ట విద్యావేత్త అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు?
మారిషస్..
రాజధాని: పోర్ట్ లూయిస్; కరెన్సీ: మారిషస్ రుపీ
ప్రస్తుత అధ్యక్షుడు: పృథ్వీరాజ్‌సింగ్ రూపన్
ప్రస్తుత ప్రధానమంత్రి: ప్రవింద్ జగన్నాథ్
94th Academy Awards: ఆస్కార్ ఫైనల్‌కు నామినేట్ అయిన భారతీయ చిత్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మారిషస్ ప్రభుత్వం అందించే ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్ పురస్కారానికి ఎంపికైన తెలుగు వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : సంజీవ నరసింహ అప్పడు
ఎందుకు : హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలలో సామాజిక పురోగతికి కృషి చేసినందున..