Skip to main content

World Cup Archery: సురేఖ జోడీకి స్వర్ణం

World Cup Archery- షాంఘై: వరల్డ్‌ కప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 (కాంపౌండ్‌ విభాగం)లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆమె స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. సురేఖ– ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే జోడి ఫైనల్లో 156–155 స్కోరు తేడాతో కొరియా జంట కిమ్‌ జోంగో–ఓహ్‌యూహ్యూన్‌ను ఓడించింది.
Surekha Jodi is gold
సురేఖ జోడీకి స్వర్ణం

తొలి మూడు ఎండ్‌లలో ఇరు జట్లు సమంగా పోటీ పడుతూ వరుసగా 39, 39, 39 చొప్పున పాయింట్లు సాధించడంతో స్కోరు 117–117తో సమంగా నిలిచింది. చివరి ఎండ్‌లో భారత ద్వయం 39 పాయింట్లు నమోదు చేయగా...కొరియా 38కే పరిమితమైంది. దాంతో సురేఖ–ఓజస్‌లకు పసిడి దక్కింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలో భారత ఆర్చర్‌ ప్రథమేశ్‌ జౌకర్‌ సంచలనం సృష్టించాడు.

ఫైనల్లో ప్రథమేశ్‌ 149–148తో నెదర్లాండ్స్‌కు చెందిన వరల్డ్‌ నంబర్‌వన్‌ మైక్‌ స్కోసర్‌పై విజయం సాధించాడు. 19 ఏళ్ల ప్రథమేశ్‌ కెరీర్‌లో ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన అవనీత్‌ కౌర్‌ కాంస్యం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అవనీత్‌ 147–144తో ఐపెక్‌ తోమ్రుక్‌ (తుర్కియే)ను ఓడించింది.  

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 May 2023 05:42PM

Photo Stories