Skip to main content

71st Miss World: మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో సినీ శెట్టి అద్భుత ప్రదర్శన

2024 మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో అద్భుతంగా జరుగుతున్నాయి.
Sini Shetty and other contestants stun at 71st Miss World

28 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం చాలా గర్వకారణం.

130కి పైగా దేశాల నుంచి పోటీదారులు ఈ పోటీలో పాల్గొని తమ అందం, ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. భారతదేశం తరఫున కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఆమె టాప్ 20 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు.

1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె కిరీటాన్ని అందుకుని మూడు దశాబ్దాలు అయినా, ఆమె అందం, ప్రతిభ ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటాయి.

2024 మిస్ వరల్డ్ 'టాలెంట్ ఫైనల్స్' రౌండ్‌లో సినీ శెట్టి ఐశ్వర్యరాయ్‌కి నివాళిగా ఆమె హిట్ పాటలకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా నుంచి నింబుడా సాంగ్‌తో పాటు బంటీ ఔర్ బబ్లీ వంటి సినిమాల పాటలకు ఆమె నృత్యం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

ఐశ్వర్య వారసత్వానికి గుర్తుగా భారతీయ శాస్త్రీయ నృత్యం, బాలీవుడ్ నృత్యం యొక్క అద్భుతమైన కలయికతో సినీ శెట్టి నృత్యం చేశారు. ఆమె ప్రతిభకు పలువురు ప్రముఖులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

Film Awards: రాష్ట్ర చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా ఇదే..

ఫిబ్రవరి 18వ తేదీ ప్రారంభమైన మిస్ వరల్డ్ 2024 ఫైనల్స్ మార్చి 9వ తేదీ ముంబైలో జరగనున్నాయి. ఈ పోటీలో సినీ శెట్టి గెలిచి మన దేశానికి కీర్తి తెస్తారని ఆశిద్దాం.

ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2024లో సినీ శెట్టి కూడా ఆ కిరీటాన్ని తీసుకుంటుందేమో చూద్దాం.

Published date : 08 Mar 2024 11:34AM

Photo Stories