Eminent Scientist of the Year 2021: నెసా ఎమినెంట్ అవార్డుకు ఎంపికైన ప్రొఫెసర్?
హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లకావత్ రాంసింగ్‌కు ఢిల్లీకి చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అకాడమీ (నెసా) అవార్డు దక్కింది. ఈ మేరకు ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్– 2021కు రాంసింగ్‌ను ఎంపిక చేసినట్టు నెసా అధ్యక్షుడు డాక్టర్ జావెద్ అహ్మద్ ఫిబ్రవరి 8న వెల్లడించారు. పాడి రైతుల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహణ, గోపాల మిత్రలకు శిక్షణ కార్యక్రమాలు, వెటర్నరీ వైద్య కోర్సు ఫైనలియర్ విద్యార్థులకు అవగాహన కల్పించడం, బొవైన్ బ్రీడింగ్‌లో జాతీయ స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు.
చదవండి: ఆస్కార్ ఫైనల్‌కు నామినేట్ అయిన భారతీయ చిత్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నెసా ‘‘ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్– 2021’’కు ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లకావత్ రాంసింగ్
ఎందుకు : పాడి రైతుల కోసం విశేష కృషి చేసినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్