Padma Awards 2022: పద్మ పురస్కారాల ప్రదానం
2022 సంవత్సరానికి 64 మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 21న పద్మ పురస్కారాలను అందించారు. ఇందులో రెండు పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తరఫున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతాప్రెస్ అధినేత దివంగత రాధేశ్యామ్ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్ ఖేమ్కాలు పద్మ విభూషణ్ పురస్కారాలను స్వీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు పద్మభూషణ్ పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం మార్చి 28న జరుగనుంది.
మొత్తం 128 అవార్డులు..
ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు.
పద్మ పురస్కారాలు–2022
పద్మ విభూషణ్ విజేతలు(4)
సంఖ్య |
పేరు |
రంగం |
రాష్ట్రం/దేశం/యూటీ |
1 |
జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం) |
సివిల్ సర్వీసులు |
ఉత్తరాఖండ్ |
2 |
రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం) |
విద్య మరియు సాహిత్యం |
ఉత్తర ప్రదేశ్ |
3 |
కల్యాణ్ సింగ్ (మరణానంతరం) |
ప్రజా వ్యవహారాలు |
ఉత్తర ప్రదేశ్ |
4 |
ప్రభా ఆత్రే |
కళలు |
మహారాష్ట్ర |
పద్మ భూషణ్ విజేతలు(17)
సంఖ్య |
పేరు |
రాష్ట్రం/దేశం/యూటీ |
రంగం |
1 |
గులాం నబీ ఆజాద్ |
ప్రజా వ్యవహారాలు |
జమ్మూ, కశ్మీర్ |
2 |
విక్టర్ బెనర్జీ |
కళలు |
పశ్చిమ బెంగాల్ |
3 |
గుర్మీత్ బవ (మరణానంతరం) |
కళలు |
పంజాబ్ |
4 |
బుద్ధదేవ్ భట్టాచర్య |
ప్రజా వ్యవహారాలు |
పశ్చిమ బెంగాల్ |
5 |
నటరాజన్ చంద్రశేఖరన్ |
వాణిజ్యం, పరిశ్రమలు |
మహారాష్ట్ర |
6 |
కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులు |
వాణిజ్యం, పరిశ్రమలు |
తెలంగాణ |
7 |
మధుర్ జాఫ్రి |
ఇతరములు–పాకశాస్త్రం |
అమెరికా |
8 |
దేవేంద్ర ఝఝారియా |
క్రీడలు |
రాజస్థాన్ |
9 |
రషీద్ ఖాన్ |
కళలు |
ఉత్తర ప్రదేశ్ |
10 |
రాజీవ్ మెహ్రిషి |
సివిల్ సర్వీసులు |
రాజస్థాన్ |
11 |
సత్య నాదేళ్ల |
వాణిజ్యం, పరిశ్రమలు |
అమెరికా |
12 |
సుందర్ పిచాయ్ |
వాణిజ్యం, పరిశ్రమలు |
అమెరికా |
13 |
సైరస్ పూనావాలా |
వాణిజ్యం, పరిశ్రమలు |
మహారాష్ట్ర |
14 |
సంజయ రాజారాం (మరణానంతరం) |
సైన్స్, ఇంజనీరింగ్ |
మెక్సికో |
15 |
ప్రతిభా రే |
విద్య, సాహిత్యం |
ఒడిశా |
16 |
స్వామి సచ్చిదానంద్ |
విద్య, సాహిత్యం |
గుజరాత్ |
17 |
వశిష్ట త్రిపాఠి |
విద్య, సాహిత్యం |
ఉత్తర ప్రదేశ్ |