Oscars Winners 2022: 94వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా
2021 సంవత్సరానికిగాను ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ (Academy of Motion Picture Arts and Sciences-AMPAS) 2022, మార్చి 28న ప్రదానం చేసింది. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా (2020, 2021) పెద్దగా సందడి లేకుండా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి కోలాహలంగా జరిగింది.
Padma Awards 2022: పద్మ అవార్డుల ప్రదానోత్సవం
ముఖ్యాంశాలు..
- ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నటుడిగా ‘కింగ్ రిచర్డ్స్’ సినిమాకి విల్ స్మిత్ , ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’కి జెయిన్ కాంపియన్ ఆస్కార్‌ను అందుకున్నారు.
- నామినేట్ అయిన మూడు విభాగాల్లోనూ (బెస్ట్ పిక్చర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్) ‘కోడా’ చిత్రం అవార్డులను దక్కించుకుంది.
- 12 ఆస్కార్ నామినేషన్స్‌ను దక్కించుకున్న ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ కేవలం ఒకే ఒక్క (బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ) అవార్డుతో సరిపెట్టుకుంది.
- పది నామినేషన్లు దక్కించుకున్న ‘డ్యూన్’ చిత్రం ఆరు ఆస్కార్ అవార్డులను చేజిక్కించుకుంది.
- మరోవైపు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా జపాన్ ఫిల్మ్ ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది.
- ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో భారత్ నుంచి రింటూ థామస్ దర్శకత్వం వహించిన ‘రైటింగ్ విత్ ఫైర్’ నామినేషన్ దక్కించుకున్నా ఆస్కార్ తేలేక పోయింది. ఈ విభాగంలో ‘సమ్మర్ ఆఫ్ సోల్’ అవార్డు దక్కించుకుంది.
- అవార్డు వేడుక నిడివి తగ్గించే క్రమంలో ముందు ప్రకటించినట్లుగానే ఎనిమిది విభాగాలకు(మానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, ఫిల్మ్ ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్, ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ సౌండ్)చెందిన అవార్డులను ముందే అందజేసి, లైవ్ టెలికాస్ట్‌లో చూపించారు.
94 ఆస్కార్ విజేతల జాబితా
- ఉత్తమ చిత్రం – చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్ (కోడా)
- ఉత్తమ నటుడు – విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
- ఉత్తమ నటి – జెస్సికా చేస్టన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫే)
- ఉత్తమ దర్శకురాలు – జెయిన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ద డాగ్)
- ఉత్తమ సహాయ నటి – అరియానా దిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
- ఉత్తమ సహాయ నటుడు – ట్రాయ్ కోట్సర్ (కోడా)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ – గ్రెగ్ ఫ్రెజర్ (డ్యూన్)
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – నో టైమ్ టు డై
- బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్– సమ్మర్ ఆఫ్ సోల్
- బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కోడా (సియాన్ హెడెర్)
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – బెల్‌ఫాస్ట్ (కెన్నత్ బ్రానా)
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – జెన్నీ బీవన్ (క్రూయెల్లా)
- బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – డ్రైవ్ మై కార్ (జపాన్)
- బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – ఎన్‌కాంటో
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – హన్స్ జిమ్మర్ (డ్యూన్)
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్ (పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియన్ కానర్, గెర్డ్ నెఫ్‌జర్)
- బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – జో వాకర్ (డ్యూన్)
- బెస్ట్ సౌండ్ – డ్యూన్ (మాక్ రూత్, మార్క్ మాంగిని, థియో గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్‌లెట్)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – డ్యూన్ (ప్రొడక్షన్ డిజైన్– పాట్రైస్ వెర్మట్, సెట్ డెకరేషన్– జుజానా సిపోస్)
- బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – ద ఐస్ ఆఫ్ ది టామీ ఫే (లిండా డౌడ్స్, స్టెఫనీ ఇన్‌గ్రామ్, జస్టిన్ రాలే)
- బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ది లాంగ్ గుడ్ బై
- బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ది విండ్‌షీల్డ్ పైపర్
- బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ద క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్
Miss World 2021: ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న యువతి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్