Skip to main content

Miss World 2021: ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న యువతి?

Karolina Bielawska

Poland's Karolina Bielawska crowned Miss World 2021: పోలాండ్‌కి చెందిన కరోలినా బైలావ్‌స్క.. మిస్‌ వరల్డ్‌–2021 టైటిల్‌ను సాధించింది. ప్యూర్టో రికో రాజధాని నగరం శాన్‌ జువాన్‌లో మార్చి 16న నిర్వహించిన 70వ ప్రపంచ సుందరి పోటీల్లో 97 దేశాల నుంచి వచ్చిన  సుందరాంగుల్ని తోసిరాజని 23 ఏళ్ల కరోలినా ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. కరోలినా తర్వాత మొదటి రన్నరప్‌గా అమెరికాకు చెందిన శ్రీ సైనీ నిలువగా, రెండో రన్నరప్‌గా కాట్‌ లివోరీ దేశానికి చెందిన ఒలీవియా ఏస్‌ నిలిచారు. మిస్‌ వరల్డ్‌–2021 పోటీలు 2021 ఏడాది డిసెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. కోవిడ్‌ వల్ల వాయిదా పడ్డాయి. ఈ పోటీల్లో పాల్గొన్న తెలుగమ్మాయి మానసా వారణాసి.. ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. ప్రపంచ సుందరిగా నిలిచిన కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీని కొనసాగిస్తోంది.

Mauritius Govt: మారిషస్‌ స్టార్‌ పురస్కారానికి ఎంపికైన తెలుగు వ్యక్తి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మిస్‌ వరల్డ్‌–2021 టైటిల్‌ను సాధించిన యువతి?
ఎప్పుడు : మార్చి 16
ఎవరు    : కరోలినా బైలావ్‌స్క(పోలాండ్‌)
ఎక్కడ    : శాన్‌ జువాన్, ప్యూర్టో రికో
ఎందుకు : 70వ ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా నిలిచినందున..

AGA: విశిష్ట విద్యావేత్త అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 17 Mar 2022 12:54PM

Photo Stories