Skip to main content

Hyderabad International Airport: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘నేషనల్‌ ఎనర్జీ లీడర్‌’ అవార్డు

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి ప్రతిష్టాత్మక ‘నేషనల్‌ ఎనర్జీ లీడర్‌’ అవార్డు లభించింది.
Proud Moment,Hyderabad International Airport,National Energy Leader Award Winner
Hyderabad International Airport

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎనర్జీమేనేజ్‌మెంట్‌’– 24వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నేషనల్‌ ఎనర్జీ లీడర్‌’,‘ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ యూనిట్‌’ అవార్డులను గెలుచుకుంది. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘నేషనల్‌ ఎనర్జీ లీడర్‌’ అవార్డు లభించడం వరుసగా ఇది ఐదోసారి కాగా ‘ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ యూనిట్‌’ అవార్డు లభించడం వరుసగా ఇది ఏడవసారి.

Swachh Vayu Sarvekshan Award 2023: గుంటూరుకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌–2023’లో అవార్డు

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌ సీఈవో ప్రదీప్‌ పాణికర్‌ మాట్లాడుతూ...ఇంధన వినియోగంలో సమర్థవంతమైన, నాణ్యమైన విధానాలను అమలుచేయడం వల్ల సత్ఫలితాలను సాధించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 2030 నాటికి కార్బన్‌ న్యూట్రాలిటీని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 

Platinum Rating For Vijayawada Station: విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్‌

 

Published date : 28 Sep 2023 11:00AM

Photo Stories