Work From Home: వర్క్ ఫ్రమ్ హోంకు ఫుల్‌స్టాప్..! ఇకపై..
రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంను ఎత్తివేసి, ఆఫీసులకు పిలవొచ్చునని ఆయన ఫిబ్రవరి 8వ తేదీన రోజున మీడియా సమావేశంలో తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడో వేవ్ ముగిసిందని..
కోవిడ్-19 మూడో వేవ్ ముగిసిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పేర్కొనడంతో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలిపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ స్ట్రాటజీకి త్వరలోనే ముగింపు పలకవచ్చునని తెలుస్తోంది. ఇక ఆయా కంపెనీలు కూడా పూర్తి స్థాయి కార్యాలయాలను ప్రారంభించేందుకు త్వరలో ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఐటి కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలవాలని భావించగా ఒక్కసారి ఓమిక్రాన్ వేరియంట్ రాకతో తిరిగి ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. అయితే రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఇప్పుడు కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు తెలంగాణలో కోవిడ్ పాజిటీవీటీ రేటు కూడా పడిపోవడంతో చాలా ఐటీ కంపెనీలు తమ మునుపటి నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నాయి.
రాబోయే రెండు వారాల్లో..!
ఐటీ కంపెనీలు రాబోయే రెండు వారాల్లో కార్యాలయాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో నష్టపోయిన స్టార్టప్, చిన్న కంపెనీలు స్టాఫ్‌ని వెనక్కి పిలిపించుకోవాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. కాగా, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ భరణి కె అరోల్ మాట్లాడుతూ...ఐటి కంపెనీలు అన్ని భద్రతా చర్యలతో సురక్షితమైన ప్రదేశాలని అన్నారు.