CM KCR : రేపు మాపో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్ : ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో ఫిబ్రవరి 1వ తేదీన మాట్లాడారు.
రేపు మాపో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. తెలంగాణలో ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త జోనల్ విధానం తీసుకొచ్చాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మల్టీ జోనల్ పోస్టింగ్ విధానం తీసుకొచ్చాం. దీని ద్వారా 5 శాతం మాత్రమే స్థానికేతరులు వస్తారు. స్థానిక నిరుద్యోగులకు 317 జీవో వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో మొత్తంలో 15లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Published date : 01 Feb 2022 09:38PM