Telangana: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెగ్యులరైజేషన్‌కు అనుమతి..
2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 29వ తేదీన (మంగళవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది.
11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను..
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 పోస్టులను భర్తీ చేస్తామని, ఇందులో 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 9న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ఆర్థిక శాఖ 30,453 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి..
రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.