Mega Job Mela 2023 : రేపు ప్రముఖ కంపెనీలతో.. మెగా జాబ్ మేళా.. అర్హతలు ఇవే..
రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ పీలేరు ఎమ్మెల్యే సి.రామచంద్రారెడ్డి సంయుక్తంగా నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆగస్టు 26వ తేదీన (శనివారం) ఉదయం 9 గంటలకు పీలేరు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలోకి నిరుద్యోగ యువతీ, యువకులు చేరుకోవాలని, ఈ మెగాజాబ్ మేళాలో బహుళజాతీయ సంస్థకు చెందిన 20 కంపెనీలు పాల్గొంటున్నట్లు డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ తెలిపారు.
ప్రముఖ కంపెనీలు ఇవే..
జాబ్ మేళాలో హెటిరో డ్రగ్స్, టెక్ మహీంద్ర, అరబిందో ఫార్మా, కియా మోటర్స్, ముతూట్ ఫైనాన్స్, క్యూసెకార్ప్, గ్రీన్‌టెక్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐఎస్‌ఓఎన్ సొల్యూషన్, అలి దీక్షన్, ఎస్‌బీఐ కార్డ్స్, అమరరాజ బ్యాటరీస్ లాంటి 20 బహుళజాతీయ కంపెనీలు పాల్గొంటారని తెలియజేశారు.
అర్హతలు ఇవే..
జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ, యువకులు విద్యార్హతలు పదవతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, బిటెక్, పీజీ చదివి 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాల వయస్సు కల్గిన అభ్యర్థులు అర్హులన్నారు. వివరాలకు 7093618420, 8897776368 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.