కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అర్హులు వీరే..?
క్రమబద్ధీకరణకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలను శాఖల వారీగా వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు లేఖలు రాసింది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించేం దుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది.
ఉద్యోగాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్..
వాస్తవానికి 2016 ఫిబ్రవరి 26న కూడా ఇదే తరహాలో ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులను కోరింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో 2017 ఏప్రిల్ 26న కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియకు అంతరాయం కలిగింది. అయితే 2021 డిసెంబర్ 7న హైకోర్టు రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 29వ తేదీన (మంగళవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 29వ తేదీన (మంగళవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేసింది.
కాంట్రాక్టు ఉద్యోగులను..
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 పోస్టులను భర్తీ చేస్తామని, ఇందులో 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 9న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇకపై కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు ఉండబోవని సీఎం ప్రకటించారు.
తెలంగాణ ఆర్థిక శాఖ 30,453 ఉద్యోగాల భర్తీకి..
రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.