Skip to main content

Success Story: టీ అమ్ముతూ... కోట్లకు పడగలు... ‘డికాక్షన్‌’ సక్సెస్‌స్టోరీ తెలుసా..?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంత కష్టపడుతున్నామన్నది లెక్కలోకి రావట్లేదు. ఎంత స్మార్ట్‌గా వర్క్‌ చేస్తూ... డబ్బులు సంపాదిస్తున్నామనే దాన్నే అందరూ పరిగణలోకి తీసుకుంటున్నారు.
Decotion

స్మార్ట్‌ వర్క్‌కి కావాల్సినదల్లా జస్ట్‌ ఒక ఐడియా మాత్రమే. నలుగురిలో భిన్నంగా ఆలోచిస్తే చాలు. ఒకే ఒక్క కొత్త ఐడియా వస్తే చాలు.. అదే మనల్ని కోట్లాధిపతులను చేస్తుంది. ఇలాంటి ఒక ఐడియానే ఆ యువజంటకు వచ్చింది. చిన్న టీ కొట్టుతో ప్రారంభించి.. నేడు కోట్లకు అధిపతులయ్యారు. వారి సక్సెస్‌ మీకోసం....

చ‌ద‌వండి: పేపర్‌ బాయ్‌ నుంచి ఐఏఎస్‌ వరకు... రాజ్‌పుత్‌ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే
2020 ఈ సంవత్సరం ప్రపంచం ఎప్పటికి గుర్తుంచుకుంటుంది. కోవిడ్‌ మహమ్మారి జడలు విప్పడంతో ప్రపంచమంతా చిగురుటాకులా వణికింది. కొన్ని లక్షల మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి సమయంలోనే హైదరాబాద్‌కు చెందిన అద్దెపల్లి సంతోషి, జయకిరణŠ లు వినూత్నంగా ఆలోచించారు. డికాక్షన్‌ పేరుతో టీ, కాఫీలను విక్రయించే దుకాణాన్ని ప్రారంభించారు. ఆలోచనతో పాటు అభి‘రుచి’కూడా నచ్చడంతో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. 
డికాక్షన్‌ ప్రారంభించిన రెండేళ్లలోనే ఏపీ, తెలంగాణలోని 25 నగరాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటయ్యాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో 130 వరకు ఔట్‌లెట్లు వెలిశాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 70 కేంద్రాలున్నాయి. ఫ్రాంచైజీ యజమానుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. మొత్తం 80 లక్షల మందికిపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నారు. మిల్క్‌ షేక్స్, థిక్‌ షేక్స్, కాఫీ వంటి పానీయాలు విక్రయిస్తున్నారు. 

చ‌ద‌వండి: నోట్ల రద్దు నిర్ణయం సరైనదే: సుప్రీం... అప్పట్లో 115 మంది మృతి...
తన సక్సెస్‌ గురించి అద్దెపల్లి కిరణ్‌ మాట్లాడుతూ.... వృత్తిరీత్యా గాయకుడిని. కరోనా వల్ల కార్యక్రమాలు లేక ఆర్థిక భారం మీద పడింది. బిజినెస్‌ పెట్టాలన్న ఆలోచన 2020 మార్చిలో వచ్చింది. మహమ్మారి సమయంలో వేడి పానీయాలకు డిమాండ్‌ ఉండడంతో వ్యవస్థీకృతంగా టీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నా. డికాక్ష‌న్‌  తొలి కేంద్రం అక్టోబర్‌ 2020లో హైదరాబాద్‌ ఏర్పాటైంది. నేను, నా భార్య సంతోషి ఇద్దరం మూడు నెలలపాటు కష్టపడ్డాం. తొలి 25 ఔట్‌లెట్లు 2021 మార్చి నాటికి, 50 సెంటర్స్‌ అదే ఏడాది అక్టోబర్‌ కల్లా అందుబాటులోకి వచ్చాయి. మూడు నెలల్లోనే వీటికి 50 ఔట్‌లెట్లు తోడవడం బ్రాండ్‌ పట్ల నమ్మకానికి నిదర్శనం. నా సొంత స్టోర్‌ కంటే ముందే రెండు ఫ్రాంచైజీ కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. మొదటి 10 ఔట్‌లెట్లూ ఆర్టిస్టులవే చెబుతారు.

చ‌ద‌వండి: మళ్లీ తెరపైకి యోయో... యోయోలో టాప్‌ స్కోరర్‌ ఎవరో తెలుసా..?
ఈ యువదంపతులకు వచ్చిన ఐడియా వారిని కోట్లాధిపతులను చేసింది. కష్టాలొస్తే కుంగిపోకుండా, వాటిని అధిగమించి పైకి ఎలా ఎదగాలో ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ సక్సెస్‌ను సొంతం చేసుకుంటారనేందుకు కిరణ్, సంతోషిలే  నిదర్శనం.

Published date : 05 Jan 2023 04:00PM

Photo Stories