Skip to main content

Success Story : ఓ పేద రైతు కొడుకు.. ఈ ప్ర‌ముఖ కంపెనీలో శాస్త్రవేత్తగా ఎంపికైయ్యాడిలా.. కానీ..

మారుమూల గ్రామంలో ఉండే.. ఓ రైతు కొడుకు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఉండే బెంగళూరులోని సెంట్రల్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌(సీఎంటీఐ)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. తెలంగాణ‌లోని భద్రాద్రి జిల్లాలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన లావుడ్యా ఆనంద్‌ ఈ ఘనత సాధించాడు.
Bhadradri District talent  scientist anand success story   Lavudya Anand, the new scientist at CMTI, Bangalore.

ఆనంద్‌ తల్లిద్రండులు లావుడ్యా ఈర్య, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉండగా పెద్ద కుమారుడు ఆనంద్‌ శాస్త్రవేత్తగా ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు శాస్త్రవేత్తగా ఎంపికైన నేపథ్యంలో గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విద్యాభ్యాసం అంతా..
ఈర్యా, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు ఆనంద్‌ ఒకటి నుంచి 5 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు సుజాతనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివాడు. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. చైన్నెలో బీఈ (ఈఈఈ) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు హైదరాబాద్‌లో గేట్‌ కోచింగ్‌ తీసుకొని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్‌ (కంట్రోల్‌ సిస్టమ్స్‌ విభాగం)లో సీటు సంపాధించాడు. ఎంటెక్‌ పూర్తయిన అనంతరం 2019 నుంచి 2021 వరకు కరోనా ప్రభావంతో విద్యాభ్యాసానికి కొంచెం బ్రేక్‌ పడింది.

☛ Success Stories : ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎస్ ఉద్యోగం కొట్టామిలా.. మా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే..

వివిధ కొలువుల రాత పరీక్షల మూలంగా..
కరోనా సమయంలో దొరికిన విరామాన్ని ఆనంద్‌ వృథాగా వదిలేయకుండా శ్రమించాడు. వివిధ కొలువుల రాత పరీక్షల మూలంగా తొలిసారిగా బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెట్‌ (బీఈఎల్‌)లో ట్రెయినీ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. నెల పాటు ఇక్కడ ట్రెయినీ ఇంజనీర్‌గా పనిచేసిన అనంతరం హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ–రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌లో ‘రీసెర్చ్‌ ఫెలో’గా ఉద్యోగం సాధించాడు. 

అనంతరం సీఎంటీఐలో శాస్త్రవేత్త కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అతను రాత పరీక్ష, మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. సీఎంటీఐలో శాస్త్రవేత్తగా ఎంపికై నట్లు అపాయిమెంట్‌ లెటర్‌ రావడంతో తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

Published date : 25 Dec 2023 08:02PM

Photo Stories