OPS: ఓపీఎస్ మోయలేని భారం.. ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయంటూ తీవ్ర హెచ్చరిక
ఆయా రాష్ట్రాల రాబడులు–వ్యయాల మధ్య సమతౌల్యం లోపించి ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయని పేర్కొంది. ‘రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు: 2022–23 బడ్జెట్‌ల పరిశీలన’ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర ఉద్యోగులకు ఓపీఎస్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆర్బీఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ దీని అమలుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఓపీఎస్‌ను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, పింఛను నిధి నియంత్రణ, అభివృద్థి సంస్థ(పీఎఫ్‌ఆర్‌డీఏ)కు తెలియజేశాయి.
చదవండి: ఇంత భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపా... వేలమంది ఒకేసారి ఇంటికి..
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా ఓపీఎస్ అమలుకు సంబంధించి గత ఏడాది నవంబరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2003లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సీపీఎస్‌ను తీసుకొచ్చింది. దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్‌ఎన్‌పీఎస్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత త్రిపుర, పశ్చిమ బెంగాల్ మినహా ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ఈ స్కీమ్‌లో చేరాయి.
2004, జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారందరూ సీపీఎస్ కిందికి వస్తారు. దీని కోసం ప్రతీనెలా ఉద్యోగి జీతం నుంచి 10 శాతం కట్ చేస్తారు. ప్రభుత్వం మరో 10 శాతం నిధులు ఇస్తుంది. ఈ పెన్షన్ నిధిని నేషనల్ పెన్షన్ స్కీం ఎన్‌పీఎస్ ట్రస్టు, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా షేర్ మార్కెట్‌లో మదుపు చేస్తారు.
పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పింఛను చెల్లిస్తారు. దీని కోసం 2013లో యూపీఏ ప్రభుత్వం, విపక్ష ఎన్డీఏ మద్దతుతో ‘‘ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్’’ పీఎఫ్‌ఆర్‌డీఏ తెచ్చిన సంగతి తెలిసిందే.