విద్యుత్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపు
Sakshi Education
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పొడిగిస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 30న రిటైరైన ఉద్యోగులకు సైతం పదవీ విరమణ వయస్సు పొడిగింపు వర్తించనుంది.
మార్చి 30న పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ ఉత్తర్వులు జారీకి రెండ్రోజుల్లోగా తిరిగి విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పదవీ విరమణ ప్రయోజనాలు పొంది ఉంటే, విధుల్లో చేరడానికి ముందు సంస్థకు తిరిగి చెల్లించాలని సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు వర్తించదు. ట్రాన్స్‌కో జారీ చేసిన ఈ ఉత్తర్వులను జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ సంస్థలు సైతం అమలు చేయనున్నాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న 18 వేలమంది ఉద్యోగులతో పాటు మరో 23 వేలమంది ఆరి్టజన్లు ప్రయోజనం పొందనున్నారు.
Published date : 16 Apr 2021 04:38PM