Competitive Exams: విజయం సాధించాలంటే అవగాహన అవసరం
ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్ 1, 2 పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు హాజరవుతున్న అభ్యర్థులను మంగళవారం రాజాగారి తోటలోని స్టడీ సర్కిల్‌ను సందర్శించి విద్యార్థులతో మమేకమైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాలతో పాటు ఆయా సిలబస్‌కు సంబంధించిన టెక్ట్‌బుక్స్‌నే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న అంశాలకు సంబంధించిన విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో ప్రణాళిక బద్ధంగా చదివితే ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు రూ.2500 విలువ చేసే స్టడీ మెటీరియల్‌ను అభ్యర్థులకు అందజేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశాలతో 50 మంది ఓసీ అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి.మధుసూధనరావు, ఫ్యాకల్టీ రఫీ, ఎంవీ నాయుడు, పవన్‌కుమార్, శేషయ్య, సిబ్బంది పాల్గొన్నారు.