‘ఉన్నత విద్యామండలి’కి అడ్వయిజరీ కమిటీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఉన్నత విద్యా మండలిలో ఏర్పాటు చేసిన క్వాలిటీ అస్యూరెన్స్ సెల్కు అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్ 24ను విడుదల చేసింది.
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి దీనికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కన్వీనర్, డైరక్టర్‌గా మండలి వైస్ చైర్మన్–1 ప్రొఫెసర్ కె.రామమోహనరావును నియమించారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ), కాలేజీ విద్య కమిషనర్, సాంకేతిక విద్య కమిషనర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శిలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఏయూ, జేఎన్‌టీయూఏ వీసీలు, 2 అటానమస్ కాలేజీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
Published date : 27 Feb 2021 03:30PM