Skip to main content

బ్రేకింగ్: 10 లక్షల ఉద్యోగాలు: కొత్త ఐటీ పాలసీ

వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో రూ.3లక్షల కోట్ల వార్షిక ఎగుమతులు సాధించాలని.. పది లక్షల మందికి ఉద్యోగాల కల్పి ంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు ప్రకటించారు.
బ్రేకింగ్: 10 లక్షల ఉద్యోగాలు: కొత్త ఐటీ పాలసీ
10 లక్షల ఉద్యోగాలు: కొత్త ఐటీ పాలసీ

డిజిటల్‌ ప్రపంచానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక నేపథ్యాల ప్రజలు సాధికారత సాధించేలా రెండో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’పాలసీకి రూపకల్పన చేశామని తెలిపారు. 2021 నుంచి 2026 వరకు అమలు చేసే ఈ రెండో ఐసీటీ పాలసీని సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్ సెంటర్‌లో మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉత్పాదకత, ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు. స్టార్టప్‌లు, పెట్టుబడిదారులకు తెలంగాణను మొదటి గమ్యస్థానంగా మార్చుతామని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లను స్థాపించడం ద్వారా ఐటీ రంగంలో కొత్తగా 50వేల ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపారు.

కొత్త ఐటీ పాలసీ లక్ష్యాలెన్నో..

డ్రైవింగ్‌ టెస్ట్‌ వంటి సేవలు మినహా దాదాపు ప్రభుత్వ సేవలన్నింటినీ.. వెబ్, మొబైల్‌ యాప్‌ల ద్వారా అందుబాటులోకి తెస్తామని, కాగితరహిత పాలన అందిస్తామని కేటీఆర్‌ చెప్పారు. ‘‘కొత్త టెక్నాలజీల యుగంలో ఐటీ పట్టభద్రులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా కృత్రిమ మేథస్సు (ఏఐ) సాంకేతికతపై ప్రాథమిక శిక్షణ ఇస్తాం. రూ.13 వందల కోట్లతో స్టార్టప్‌ ఫండ్‌తోపాటు ప్రభుత్వ పెట్టుబడుల కమిటీ ఏర్పాటు చేసి 8వేల స్టార్టప్‌లకు చేయూతనిస్తాం. దేశంలోనే తెలంగాణను స్టార్టప్‌లకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. ఎలక్ట్రానిక్‌ వాహనాలు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, వైద్య ఉపకరణాలు, ఆటోమొబైల్‌ రం గాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తాం. ఎలక్టానిక్స్‌ రంగం ద్వారా రూ.75వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కారిడార్‌’ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేథ, మెషీన్ లెరి్నంగ్, బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. డేటా స్టాక్, డేటా ఎనాలసిస్‌ వింగ్‌ ఏర్పాటు చేస్తాం. స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరి ష్కారాల ద్వారా రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) అం డగా నిలుస్తాం. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో ‘స్మార్ట్‌ సిటీస్‌ వింగ్‌’ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 40 ‘స్మార్ట్‌ రీజియన్లు’సృష్టిస్తాం..’’అని ప్రకటించారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ వృద్ధి

కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఐటీ రంగం అద్వితీయంగా పురోగమించిందని నాస్కామ్‌ చైర్‌పర్సన్ రేఖా మీనన్ అభినందించారు. రెండో ఐటీ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పాలసీలతో పురో గామి విధానాలు అవలంభిస్తోందని ప్రశంసిం చారు. ఇక తెలంగాణ ఐటీ రంగంతో అమెరికాకు గాఢమైన బంధముందని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రైఫ్‌మన్ అన్నారు. హైదరాబాద్‌లో 48 అమెరికా ఐటీ సం స్థల కార్యకలాపాల ద్వారా 1.10 లక్షల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సైయంట్‌ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్‌ మోహన్ రెడ్డి, రాజన్న(టీసీఎస్‌), ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌ డైరెక్టర్‌ రమాదేవి లంక, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ లు పాల్గొన్నారు. 

దేశంలోనే వేగంగా పురోగమిస్తున్నాం

కోవిడ్‌తో జాతీయ వృద్ధిరేటు 1.26 శాతానికి పడిపోయినా.. రాష్ట్రం 2020–21లో రూ.9.78 లక్షల జీఎస్‌డీపీ, 8%వృద్ధిరేటు సాధించిందని, తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని కేటీఆర్‌ అన్నారు. రూ.1.45 లక్షల కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించామని, 2016 నాటి తొలి ఐసీటీ పాలసీ లక్ష్యాలను అం దుకున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రముఖ పెట్టుబడిదారులను ఆకర్షించామని, 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు సాధించామని తెలిపారు. ఇం దులో కేవలం ఎలక్ట్రానిక్స్‌ రంగంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతోపాటు దేశంలోని ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో 7% వాటా సాధించామన్నారు. టీహబ్, వీహబ్, టీఎస్‌ఐసీ, రీచ్, టాస్క్, టీవర్క్స్‌ వంటివాటితో ఆవిష్కరణల వాతావరణాన్ని సృష్టించామని, 15 వందలకుపైగా స్టార్టప్‌లకు రూ.1,800 కోట్ల మేర నిధులు అందా యని తెలిపారు. టాస్‌్కద్వారా 3 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, ఆన్ లైన్ లో 500 రకాల ప్రభుత్వ సేవలు, టీ యాప్‌ ఫోలియో ద్వారా 250 ప్రభు త్వ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఓపెన్ డేటా, బ్లాక్‌ చెయిన్, డేటా అనలిటిక్స్, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ అడాప్షన్ వంటి పాలసీలు, 3వేలకు పైగా పబ్లిక్‌ వైఫై పాయింట్లు, ఐదు లక్షల మందికి డిజిటల్‌ అక్షరాస్యత వంటి లక్ష్యాలను ఐదేళ్లలో సాధించామన్నారు.

ఐదు అంశాలు.. పన్నెండు రంగాలు

 • రాష్ట్ర ప్రజలను డిజిటల్‌      అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం
 • ఐటీ ఉత్పత్తులు, ఇంజనీరింగ్, ఆర్‌ అండ్‌ డీ కేంద్రంగా తెలంగాణ
 • ప్రభుత్వ సేవలను ప్రజలకు అందు బాటులోకి తెచ్చేలా ఆవిష్కరణలు
 • బహుళ లక్ష్యాలు సాధించేలా రెండో ఐటీ పాలసీ

5 అంశాలివీ..

పౌరులను డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, డిజిటల్‌ సేవలు, ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఐసీటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, కోవిడ్‌ సంక్షోభ పరిస్థితి ఆధారంగా ఐటీ పరిష్కారాలు కనుగొని అభివృద్ధి బాటలో సాగడం లక్ష్యంగా ఈ పాలసీని
రూపొందించినట్టు వెల్లడించింది.

12 రంగాలివీ..

ఐటీ ఉత్పత్తులు, ఐటీ ఆధారిత ఇతర ఉత్ప త్తులు, ఎలక్ట్రానిక్స్, కొత్త ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, కాగిత రహిత పాలన, డిజి టల్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్‌ అక్షరాస్యత, ఎమర్జింగ్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ పాలసీ, టెక్నా లజీ వినియోగాన్ని పెంచేలా ఐటీ శాఖను బలోపేతం చేయడం, పట్టణ ప్రాంతాలకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పన.

రెండో ఐసీటీ పాలసీ విశేషాలు..

 • ఐటీ రంగం ద్వారా 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాల కల్పన, రూ.3 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యం.
 • ఎల్రక్టానిక్‌ ఉపకరణాలు, మొబైల్స్‌
 • తయారీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్టోరేజీ ఎనర్జీ వ్యవస్థలు, ఐటీ హార్డ్‌వేర్, టెలికాం ఉపకరణాలు, సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్, మెడికల్‌ డివైజెస్, ఆటోమోటివ్, రక్షణ రంగ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీకి ప్రోత్సాహం.
 • 8వేలకు పైగా స్టార్టప్‌ల ద్వారా
 • రూ.10 వేలకోట్ల మేర పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం. రూ.1,300 కోట్లతో స్టార్టప్‌ ఫండ్, రూ.100 కోట్లతో క్షేత్రస్థాయి ఆవిష్కరణల నిధి ఏర్పాటు. 
 • స్థానికులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ. కనీసం 80శాతం మందికి నైపుణ్య శిక్షణ. ఏటా 50వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు.
 • పౌరసేవలను వంద శాతం ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తేవడం. వెయ్యికి పైగా ప్రభుత్వ సేవలను మొబైల్‌ ఫోన్ల ద్వారా అందజేయడం.
 • రాష్ట్రవ్యాప్తంగా 5జీ సేవలు, టీఫైబర్‌ ద్వారా 2026 నాటికి ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వంద శాతం ఇంటర్నెట్‌ సౌకర్యం.
 • ఐదు ప్రాంతీయ కేంద్రాల ద్వారా జిల్లాల్లో ఆవిష్కరణల వాతావరణం కలి్పంచడం.
 • ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కనీసం 5శాతం ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించడం. 

సాధారణ స్మార్ట్‌ఫోన్ యాప్‌ల వినియోగం మొదలుకుని, అత్యాధునిక సాంకేతికత దాకా రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ డిజిటల్‌ జీవితాన్ని అందిస్తాం. ప్రజల రోజువారీ జీవితానికి తోడ్పడేలా మెరుగైన పౌర సేవలను కాగిత రహిత విధానంలో అందిస్తాం. ప్రతి ఇంట్లో ఒకరిని, స్వయం సహాయక సంఘాల మహిళలను డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, మారుమూల ప్రాంతాల ప్రజానీకానికి డిజిటల్‌ సేవలు అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ‘డిజిటల్‌ తెలంగాణ సెంటర్లు’ఏర్పాటు చేస్తాం.
– మంత్రి కేటీఆర్‌
చదవండి:

IT Companies: వర్క్ ఎట్ ఆఫీస్!: ఐటీ కంపెనీలు

Polycet: ఐటీ, రోబోటిక్స్, కోడింగ్.. కొత్తగా ఐదు కోర్సులు!

Published date : 17 Sep 2021 01:53PM

Photo Stories