త్వరలో జిల్లాకో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మరిన్ని విద్యా సంస్థలు అందుబాటులోకి రానున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 23 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా... ఇప్పుడు వీటి సంఖ్య 242కు పెరిగింది. గురుకుల పాఠశాలలు పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రతి జిల్లాలో ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) భావిస్తోంది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఇంటర్మీడియట్ వరకు కాలేజీలున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ కేటగిరీలో రాష్ట్రంలో ఒకేఒక్క మహిళా డిగ్రీ కాలేజీ మాత్రమే ఉంది. అయితే గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఇంటర్మీడియట్‌తో డ్రాప్ ఔట్ అవుతున్నట్లు ఆ శాఖ పరిశీలనలో తేలింది. రెసిడెన్షియల్ మోడల్‌లో డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తే డ్రాప్ ఔట్‌ల సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రతి జిల్లాకో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
32 కాలేజీలకు ప్రతిపాదనలు
బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మహిళా డిగ్రీ కాలేజీ కొనసాగుతోంది. దీంతో సిద్దిపేట మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఒక్కో కాలేజీ ఏర్పాటుకు బీసీ గురుకుల సొసైటీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ప్రాధాన్యత క్రమంలో బాలబాలికలకు కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను బీసీ గురుకుల సొసైటీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే క్షేత్రస్థాయిలో చర్యలు వేగవంతం కానున్నాయి. ప్రభుత్వం నుంచి వేగంగా అనుమతులు వస్తే 2021–22 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామని గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.

Published date : 30 Mar 2021 04:36PM