తీపి కబురు: సివిల్స్ చివరి ప్రయత్నం’ అభ్యర్థులకు మరో అవకాశం
Sakshi Education
న్యూఢిల్లీ: 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి, వరదల కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది అభ్యర్థులు సివిల్ సర్వీస్ పరీక్షకు (సీఎస్‌ఈ) హాజరు కాలేకపోయారు.
వీరిలో చివరి ప్రయత్నం (లాస్ట్ అటెంప్ట్) అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరికి కేంద్రం తీపి కబురు చెప్పింది. వీరికి 2021లో మరో అవకాశం ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అవకాశం నిర్దేశిత వయసులోపు ఉన్నవారికే వర్తిస్తుంది. వయసు మీరిన ‘చివరి ప్రయత్నం’ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే. 2020లో పరీక్ష రాయలేకపోయిన వారు మరో అవకాశం కింద 2022లో రాసేందుకు మాత్రం వీల్లేదు. కరోనా వల్ల 2020లో సివిల్స్‌కు హాజరుకాలేకపోయిన అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది.
Published date : 06 Feb 2021 04:30PM