టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
మార్చి 2న లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ కన్వీనర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మే 27న లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహిస్తారు. లాసెట్ దరఖాస్తు రుసుము రూ. 800 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తు రుసుము రూ. 1000 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 800 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మే 21 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Published date : 24 Feb 2020 03:34PM