టీఎస్ ఈసెట్-20 ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఈసెట్-20 ఫలితాలు సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 4గంటలకు విడుదల చేశారు.
ఈ ఫలితాలను జేఎన్‌టీయూహెచ్‌లోని యూజీసీ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అంశాల్లో ఆగస్టు 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలోనూ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం శుభపరిణామం అని అన్నారు. పరీక్ష నిర్వహణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. టీఎస్ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సెట్ కన్వీనర్ డాక్టర్ ఎం.మంజూర్ హుస్సేన్ తెలిపారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 11 Sep 2020 05:00PM