టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాలకు నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు నవంబర్ 20 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
గురువారం వరకు 8,216 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారని, వారంతా ఈనెల 20, 21 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని పేర్కొన్నా రు. వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఈ నెల 20 నుం చి 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. బైపీసీ విద్యార్థులు మేథమెటిక్స్‌లో బ్రిడ్జి కోర్సు లేకుండా బీటెక్ బయోటెక్నాలజీలో చేరవచ్చని, అయితే వారు ఫండమెంటల్స్ ఆఫ్ మేథమెటిక్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందన్నారు.
Published date : 20 Nov 2020 04:10PM