Skip to main content

టీఎస్ ఐసెట్‌లో 17,421 సీట్ల భర్తీ.. మిగిలిన సీట్లు ఎన్నంటే..

సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఐసెట్ చివరి దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ శనివారం రాత్రి ప్రకటించింది.
రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో 24,690 సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో 17,421 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 7,269 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు 279 ఉండగా.. అందులో 104 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెండు కాలేజీల్లో మాత్రం ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 267 ఎంబీఏ కాలేజీల్లోని 22,797 సీట్లకు 15,545 సీట్లు భర్తీ కాగా, 7,252 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 35 ఎంసీఏ కాలేజీల్లోని 1,893 సీట్లకు 1,876 సీట్లు భర్తీ అవగా, 17 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 29వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, అలాగే సీట్లు పొందిన కాలేజీల్లోనూ రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ సూచించింది.
Published date : 28 Dec 2020 02:41PM

Photo Stories