Skip to main content

Competitive Exams: లాజికల్‌ థింకింగ్‌తో పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు

succeed in competitive exams with logical thinking

తిరుపతి ఎడ్యుకేషన్‌: లాజికల్‌ థింకింగ్‌(తార్కిక ఆలోచన)తో పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండయూరి వీరేంద్రనాథ్‌ తెలిపారు. మంగళవారం తిరుపతి ఎమ్మార్‌పల్లె సర్కిల్లోని కౌటిల్య విద్యాసంస్థలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘స్టెప్‌ ఫర్‌ సక్సెస్‌’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి యండమూరి మాట్లాడుతూ స్వీయ జ్ఞానంతో మనలోని శక్తిని తెలుసుకున్నప్పుడే మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. లీడర్‌షిప్‌, కామన్‌సెన్స్‌, కమ్యునికేషన్‌, తెలివి ఉంటే జీవితంలో ఉన్నతంగా రాణించవచ్చని పేర్కొన్నారు. విజయ సాధనలో ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు వచ్చినా లక్ష్యం చేరేవరకు విశ్రమించకూడదని సూచించారు. అనంతరం బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌), క్యాట్‌ తదితర పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. కార్యక్రమంలో కౌటిల్య విద్యాసంస్థ డైరెక్టర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

APPSC Exams Hall Tickets Download 2023 : వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ వివిధ పరీక్షల హాల్‌ టికెట్లు.. ఈలోగా హాల్‌టికెట్లల‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..

Published date : 10 Aug 2023 03:25PM

Photo Stories