సీఐడీకి 25 శాతం ప్రత్యేక భృతి
Sakshi Education
సాక్షి, అమరావతి: నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో పనిచేసే అధికారులు, సిబ్బందికి 25 శాతం ప్రత్యేక భృతి (స్పెషల్ అలవెన్స్) ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్ జనవరి 2 (గురువారం)నఉత్తర్వులు ఇచ్చారు. మూలవేతనం (బేసిక్ పే)పై 25 శాతం అదనంగా ప్రత్యేక భృతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ, డీజీపీలకు సూచించారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న దీన్ని ప్రభుత్వం ఆచరణలో చూపించడం పట్ల సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు నూతన సంవత్సర కానుకగా ప్రత్యేక భృతి ఇచ్చినందుకు సునీల్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 03 Jan 2020 03:17PM