సెప్టెంబర్ 22న టీఎస్‌పీఈ సెట్ – 2021 పరీక్ష
Sakshi Education
సాక్షి,హైదరాబాద్: వ్యాయామ కోర్సుల్లో (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ విభాగం (టీఎస్‌పీఈసెట్) సెప్టెంబర్ 22న పరీక్ష నిర్వహించనుంది.
ఈ పరీక్షకు ఆగస్టు 30లోగా దరఖాస్తులు పంపుకోవాలని, రూ, 500 జరిమానాతో వచ్చే నెల 4 వరకూ అనుమతిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ వడ్డేపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించిన విధివిధానాలపై చర్చించేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైఎస్ చైర్మన్ లింబాద్రి అధ్యక్షత శనివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హాల్ టికెట్లను సెప్టెంబర్ 9న డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
చదవండి: నిరుద్యోగ యువతకు `సీపెట్` ఉచిత నైపుణ్య శిక్షణా కోర్సులు
చదవండి: అటెన్షన్: సాయుధ బలగాల్లో దివ్యాంగులకు నో రిజర్వేషన్
చదవండి: నిరుద్యోగ యువతకు `సీపెట్` ఉచిత నైపుణ్య శిక్షణా కోర్సులు
చదవండి: అటెన్షన్: సాయుధ బలగాల్లో దివ్యాంగులకు నో రిజర్వేషన్
Published date : 23 Aug 2021 02:59PM