Skip to main content

రేపటి నుంచి టీఎస్‌ ఐసెట్‌ – 2021 పరీక్షలు

కేయూ క్యాంపస్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఆన్‌లైన్‌లో ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించే టీఎస్‌ఐసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం వరంగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐసెట్‌కు 66,061 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షను మూడు సెషన్లలో 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 75 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్క నిమిçషం ఆలస్యమైనా విద్యార్థులను కేంద్రం లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు తమకు కోవిడ్‌ లేదనే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కోవిడ్‌ లక్షణాలు, థర్మల్‌ స్క్రీనింగ్‌లో అధిక ఉష్ణోగ్రతలున్నవారికి అనుమతి లేదని తెలిపారు.

చ‌ద‌వండి: ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ 5వ తరగతి, ఇంటర్‌ ప్రవేశాలు పూర్తి

చ‌ద‌వండి: ఏపీలో పూర్తి స్థాయిలో తెరచుకున్న పాఠశాలలు.. తొలిరోజే విద్యాకానుక కిట్లు..
Published date : 18 Aug 2021 04:48PM

Photo Stories