ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును పొడిగించింది.
కొన్నింటిని ఈనెల 30 వరకు, కొన్ని పరీక్షలకు వచ్చే నెల 15, 16, 31 తేదీల వరకు గడువును పెంచింది.
- మార్చి 31తో ముగిసిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జేఈఈ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించారు.
- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్‌డీ, ఎంబీఏ ప్రవేవేశాలకు నిర్వహించాల్సిన అడ్మిషన్ టెస్టు దరఖాస్తుల స్వీకరణ గడువు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు కూడా ఈనెల 30 వరకు పొడిగించారు.
- యూజీసీ నెట్ (జూన్) దరఖాస్తుల గడువును మే 16కి పొడిగించారు.
- సీఎస్‌ఐఆర్ నెట్ దరఖాస్తుల గడువు మే 15కి, ఆల్‌ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టు (ఏఐఏపీజీఈటీ) దరఖాస్తు గడువును మే 31కి పెంచారు.
Published date : 02 Apr 2020 03:29PM