పోలీసు పోటీ పరీక్షలకు నేటి నుంచి ‘టి సాట్’లో ప్రసారాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల కోసం ‘టి సాట్’గురువారం నుంచి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుందని సంస్థ సీఈవో ఆర్.శైలేశ్రెడ్డి వెల్లడించారు.
ఈ నెల 5 నుంచి ఏడో తేదీ వరకు మధ్యాహ్నం 3.30 నుంచి గంటపాటు ఇంగ్లి‹Ù, జనరల్ ఇంటెలిజెన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు తమ సందేహాలను 040–2354 0326, 2354 0726, టోల్ ఫ్రీ 18004254039 ఫోన్‌నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
Published date : 05 Aug 2021 03:37PM