పలు నిబంధనలతో.. సెప్టెంబర్ 27నజేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష
Sakshi Education
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ డ్ - 2020లో పలు నిబంధనలు చేర్చారు.
కోవిడ్ నిబంధనలను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు నిరాకరించినా, ఉల్లంఘించినా పరీక్షలకు అనర్హులుగా మారతారు. ఈ మేరకు జేఈఈ అడ్వాన్స్ డ్ నిర్వహణ సంస్థ ఐఐటీ న్యూఢిల్లీ మార్గదర్శకాలు జారీచేసింది. అడ్మిట్‌కార్డుల్లో వీటిని పొందుపరిచారు.
జేఈఈ అడ్వాన్స్ డ్ 2020 మాక్ టెస్ట్స్, ఆన్‌లైన్ టెస్ట్స్, గెడైన్స్... ఇతర తాజా సమాచారం కొరకు క్లిక్ చేయండి.
జేఈఈ అడ్వాన్స్ డ్ 2020 మాక్ టెస్ట్స్, ఆన్‌లైన్ టెస్ట్స్, గెడైన్స్... ఇతర తాజా సమాచారం కొరకు క్లిక్ చేయండి.
- జేఈఈ అడ్వాన్స్ డ్ ఈనెల 27న ఉదయం 9 గంటల నుంచి పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పేపర్ 2 పరీక్ష ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది.
- ఉదయం 7కల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభ సమయం తరువాత కేంద్రాల్లోకి అనుమతించరు. నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించరు. పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండదు.
- అడ్మిట్‌కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి. కోవిడ్ 19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సమర్పించాలి.
- గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి అరగంట ముందు హాలులోకి అనుమతిస్తారు.
పెన్నులు, పెన్సిళ్లు అభ్యర్థులే తెచ్చుకోవాలి..
- విద్యార్థులకు కేటాయించిన సీట్ల వద్ద కంప్యూటర్ స్క్రీన్‌పై రోల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి.
- రఫ్ వర్కు కోసం ప్రత్యేకంగా స్క్రిబిల్ ప్యాడ్ అందిస్తారు. అదనంగా మళ్లీ ఇవ్వరు. అభ్యర్థులు వాటిని తమతో పాటు తీసుకు వెళ్లవచ్చు. పెన్, పెన్సిల్ తెచ్చుకోవాలి. వీటిని పరీక్ష కేంద్రంలో ఇవ్వరు.
- అభ్యర్థులు మాస్కులు ధరించి రావాలి. చిన్న శానిటైజర్ బాటిల్, పారదర్శకంగా ఉంటే వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు.
ఇవి నిషిద్ధం..
- పరీక్షా కేంద్రాల్లోకి స్మార్ట్, డిజిటల్, ప్రోగ్రాంబుల్ గడియారాలు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, మైక్రోఫోన్లు, పేజర్స్, హెల్త్ బ్యాండ్‌స, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ముద్రిత పత్రాలు, రైటింగ్ ప్యాడ్‌లు, స్కేల్స్, జామెట్రీ, పెన్సిల్ బాక్సులు, పర్సులు, కాలిక్యులేటర్లు, పెన్ డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ పెన్నులు,హ్యాండ్‌బ్యాగులు అనుమతించరు.
- సాధారణ గడియారాలు ధరించవచ్చు. అలంకరణ, ఆకర్షణ వస్తువులు ధరించరాదు. రింగులు, బ్రాస్లెట్, చెవిపోగులు, ముక్కు పిన్, గొలుసు, లాకెట్టు, బ్యాడ్‌జ, హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, పెద్ద బటన్లతో కూడిన దుస్తులు ధరించరాదు. షూస్ కాకుండా ఓపెన్ పాదరక్షలు వేసుకోవాలి.
Published date : 25 Sep 2020 03:11PM