పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఉచిత నైపుణ్య శిక్షణ
Sakshi Education
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ చదివిన విద్యార్థినులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో
పాటు ఫ్రాన్స్ కు చెందిన ఆల్‌స్టామ్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పన చేస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డెరైక్టర్ అర్జా శ్రీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు.
2019లో ఎలక్ట్రికల్ డిప్లొమా లేదా ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న వారికి ఉచిత వసతితోపాటు శిక్షణ ఇస్తామని చెపాు. ఈ నెల 21లోపు ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు డిప్లొమాతో పాటు బీటెక్ చదివినా, బీటెక్ చదువుతున్నా లేదంటే ఇతర పీజీ అర్హతలున్న వారు అర్హులు కాదని సష్టం చేశారు. వివరాలకు htt p://e nfi neei nf.a prrdc.i n/rieme nrP aceme ntr వెబ్‌సైట్‌ను లేదా 9848302333 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఏపీఎస్‌ఎస్‌డీసీ హెల్‌లెన్ 18004252422 కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను జిల్లాల నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పరిశీలించి.. తగిన అర్హతలున్న వారిని నెల్లూరు జిల్లా తడ వద్దనున్న శ్రీ సిటీలో నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తారని శ్రీకాంత్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్కిల్ డెవలప్‌మెంట్, ఆల్‌స్టామ్ సంస్థ సర్టిఫికెట్లు ఇస్తాయని తెలిపారు. శిక్షణలో మెరుగైన ప్రతిభ చూపిన వారికి కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఆల్‌స్టామ్‌లో ఉద్యోగ అవకాశాలు కలి్తారని చెపాు. ఎంపికై న వారికి ఏడాదికి రూ.3 లక్షల జీతం ఉంటుందని, మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెపాు.
Published date : 19 Oct 2020 04:41PM