నవంబర్ 9లోగా సీట్లు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా మొదటి దశలో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 9వ తేదీలోగా సీట్లు రద్దు చేసుకుంటే, వారు చెల్లించిన ఫీజు పూర్తిగా తిరిగి వస్తుం దని ఎంసెట్ ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు.
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో సీట్లు పొందిన విద్యార్థులు, యాజమాన్య కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 9లోగా రద్దు చేసుకోవాలని సూచించారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 36,216 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈనెల 9వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, వారికి 12న సీట్లను కేటాయిస్తామన్నారు.
Published date : 05 Nov 2020 03:12PM