నేడు టీఎస్ ఎంసెట్ సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈనెల 24వ తేదీన సాయంత్రం ప్రవేశాల కమిటీ సీట్లను కేటాయించనుంది.
ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 55,788 మందిలో 54,892 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోగా వారికి నేడు సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు 28వ తేదీలోగా ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ https:// tseamcet.nic.inలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించింది.
Published date : 24 Oct 2020 04:40PM