నేడు జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు.. రేపటి నుంచి అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్లు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
ఈనెల 12వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఐఐటీ ఢిల్లీ ఇదివరకే షెడ్యూలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మెయిన్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ డ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకోనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 27వ తేదీన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను నిర్వహించేందుకు ఐఐటీ ఢిల్లీ చర్యలు చేపట్టింది.
Check JEE Advanced 2020 notification here.
Check JEE Advanced 2020 notification here.
Published date : 11 Sep 2020 02:38PM