నాలుగో రోజూ ప్రశాంతంగా సచివాలయ రాతపరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి.
గత నాలుగు రోజులుగా జరిగిన 8 రకాల రాతపరీక్షలకు 7,28,323 మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రానున్న మూడు రోజుల్లో జరిగే ఆరు పరీక్షలకు 56,887 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉందని పేర్కొన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 13,176 మంది దరఖాస్తు చేసుకోగా.. బుధవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా 52 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 10,404 మంది హాజరయ్యారు. సాయంత్రం వార్డు ఎడ్యుకేషన్ - డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉద్యోగాలకు 28,996 మంది దరఖాస్తు చేసుకోగా, సాయంత్రం 118 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 19,407 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నాలుగు రోజులుగా జరిగిన రాత పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల జవాబు పత్రాలను ఇప్పటి వరకు 3,05,000 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పూర్తయ్యిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Published date : 24 Sep 2020 04:23PM