మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఈ నెల 19న నిర్వహించాల్నిన పరీక్షను వాయితా వేసినట్లు మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
కరోనా కారణంగా ఈ నెల 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీ క్ష ను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మగిలిన సీట్లలో ప్రవేశాల కోసం ఈ నెల 19న ఈ ప్రవేశ పరీ క్ష ను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రవేశ పరీక్ష ను వాయిదా వేస్తున్నామని, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న వివరాలను తరువాత తెలియజేస్తామని వెల్లడించారు.
Published date : 10 Apr 2020 04:46PM