మే నెలలో పరీక్షల నిర్వహణ కష్టమే :తుమ్మల పాపిరెడ్డి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, డిగ్రీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలపై లాక్‌డౌన్ తరువాతే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు.
వివిధ డిగ్రీ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలు కాకుండా మిగతా వారికి పరీక్షలు, ఫలితాలతో సంబంధం లేకుండా (డిటెన్షన్ తాత్కాలికంగా నిలిపివేసి) ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏప్రిల్ 22న వైస్ చైర్మన్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులతోనూ చర్చించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తామని, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ఆ తరగతుల నిర్వహణలో సమస్యలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలే కనిపిస్తున్నాయన్నారు. అదే జరిగితే మేలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్నారు.
‘డిగ్రీ’ తర్వాతే సెట్‌లు :
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలతో ముడిపడిన ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఈసెట్ వంటి పరీక్షలను డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల తరువాతే నిర్వహిస్తామని పాపిరెడ్డి తెలిపారు. డిగ్రీతో సంబంధం లేని ఎంసెట్, ఈసెట్ పరీక్షలను ముందుగా నిర్వహిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో డిగ్రీ వార్షిక పరీక్షల నిర్వహణ అసాధ్యమన్నారు.
ఇంజనీరింగ్‌లో సిలబస్ తగ్గించే ఆలోచన..
ఇంజనీరింగ్ పరీక్షల్లో సిలబస్ తగ్గించే ఆలోచన ఉందని, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌తో పరీక్షలు జరిపే ఆలోచన చేస్తున్నామని పాపిరెడ్డి చెప్పారు. కాలేజీల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేయవద్దని, జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.వాటిని పాటించకపోతే చర్యలు చేపడతామని హెచ్చరించారు. తమ పరిధిలోని వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే రెండేళ్లపాటు ఫీజులు పెంచే అవకాశం లేదన్నారు. కాగా డిగ్రీ కాలేజీల్లో కూడా పాత ఫీజులే వర్తిస్తాయని, ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవని పాపిరెడ్డి హెచ్చరించారు. ప్రైవేటు యూనివర్సిటీల విషయంలో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

Published date : 23 Apr 2020 04:06PM