మే లోనే... పైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్లు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్(గుర్తింపు) విషయంలో కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా కాలేజీలకు సంబంధిం చిన సమగ్ర అంశాలపై ఇప్పటికే విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచం ద్రన్.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఇతర అధికారులతో సమీక్షిం చారు. రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ కాలేజీలున్నా యి? వాటిలో ఎన్నింటికి ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉంది? ఎన్నింటికి కండిషనల్ గుర్తింపు ఇచ్చింది అనే వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. జూనియర్ కాలేజీలకు సంబం దించిన సమగ్ర అంశాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ నెల 20న సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసిన నేపథ్యంలో.. ఇంటర్మీడియట్ బోర్డు నివేదికను రూపొం దిస్తోంది. వచ్చే మార్చిలో అఫిలియేషన్లకు నోటిఫికేషన్ ఇచ్చి, మే ఆఖరులోగా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత గుర్తింపు ఉన్న, గుర్తింపు లేని వాటి వివరాలను ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చింది. 2019-20 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 2,786 జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం రిజిస్టర్ చేసుకోగా.. 2,570 కాలేజీలకు అనుమతి లభించింది. ఇందులో 1,486 ప్రైవేట్ కాలేజీలున్నాయి. అవికాకుండా మరో 79 ప్రైవేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని, అయినా అవి కొనసాగుతు న్నట్లు బోర్డు తేల్చింది. మరోవైపు కాలేజీ హాస్టళ్లను కూడా నియంత్రణలోకి తీసుకురావాలని భావిస్తోంది. 500కు పైగా ఉన్న ఆయా హాస్టళ్లకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాటి విషయంలో విధానాన్ని రూపొందించి, అమలు చేయాలని నిర్ణయించింది.
Published date : 20 Feb 2020 03:19PM