‘లా నేస్తం’ స్టైఫండ్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: లా నేస్తం పథకంలో భాగంగా అర్హులైన జూనియర్ న్యాయవాదులకు ఐదు నెలలకు సంబంధించి స్టైఫండ్ విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లా నేస్తం పథకం కింద.. మూడేళ్లు, అంతకంటే తక్కువ ప్రాక్టీస్ ఉన్న జూనియర్ న్యాయవాదులు ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి నెలకు గాను 1,475 మంది జూనియర్ న్యాయవాదులకు రూ.73.75 లక్షలు, ఫిబ్రవరికి గాను 1,456 మందికి రూ.72.80 లక్షలు, మార్చికి గాను 1,451 మందికి రూ.72.55 లక్షలు, ఏప్రిల్‌కు సంబంధించి 1,425 మందికి రూ.71.25 లక్షలు, మే నెలకు సంబంధించి 1,386 మంది జూనియర్ న్యాయవాదులకు రూ.69.30 లక్షలను స్టైఫండ్ కింద మంజూరు చేసింది.
చదవండి: 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
చదవండి: హెచ్‌సీయూ – 2021 ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
చదవండి: ప్రాథమిక పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలుకు రంగం సిద్ధం..!
చదవండి: జూలై 1లోగా తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్

Published date : 22 Jun 2021 01:37PM